Representational Image (Photo Credits: ANI)

New Delhi, April 24: దేశ రాజధాని ఢిల్లీలో జైపూర్‌ గోల్డెన్ ఆస్పత్రిలో (Jaipur Golden Hospital) కోవిడ్‌తో తీవ్రంగా బాధపడుతున్న మరో 20 మంది రోగులు ఆక్సిజన్‌ అందక మృతి (20 Critically Ill Patients Die) చెందారు. మరో 200 మందికి పైగా ప్రాణాలు ప్రమాదంలో ఉన్నాయని ఆస్పత్రి వర్గాలు పేర్కొంటున్నారు. మరో అరగంటపాటే ఆక్సిజన్‌ నిల్వలు (Oxygen Shortage in Delhi) ఉన్నాయని గోల్డెన్‌ ఆస్పత్రి వైద్యులు తెలిపారు. ఆక్సిజన్‌ కొరత వల్లే 20 మంది రోగులు ప్రాణాలు కోల్పోయారని పేర్నొన్నారు. మరోవైపు ఆక్సిజన్‌ నిల్వలు లేక ఢిల్లీలోని సరోజ్‌ ఆస్పత్రిలో అడ్మిషన్లు కూడా నిలిచిపోయాయి. ప్రస్తుతమున్న రోగులను సరోజ్‌ ఆస్పత్రి వర్గాలు డిశ్చార్జి చేస్తున్నాయి.

లెక్క ప్రకారం శుక్రవారం సాయంత్రం 5 గంటల కల్లా ఆస్పత్రికి ఆక్సిజన్ సరఫరా అందాల్సి ఉంది. కానీ అర్ధరాత్రి 12 గంటలకు ఆక్సిజన్ అందింది. దీనిపై ఆస్పత్రి వర్గాలు మాట్లాడుతూ.... ‘‘మరణించిన 20 మంది రోగులూ ఆక్సిజన్‌ సపోర్ట్‌తో ఉన్నారు. ఆక్సిజన్ సరిపడా లేని కారణంగా మేము ఆక్సిజన్ సరఫరా ఫ్లోను తగ్గించాం. అందరూ ఆక్సిజన్ అందక మరణించారని నేను అనడం లేదు. కానీ అదీ ఓ కారణమే’’ అని ఆస్పత్రి వర్గాలు పేర్కొన్నాయి.

మే నెలలో మరింతగా కరోనా ఉగ్రరూపం, మరణాలు అత్యధిక స్థాయిలో నమోదయ్యే అవకాశం, సంచలన విషయాలను వెల్లడించిన యుఎస్ ఐఎంహెచ్‌ఈ అధ్యయనం

అదే విధంగా ఢిల్లీలోని బాత్రా ఆస్పత్రిలోనూ ఆక్సిజన్‌ నిల్వల కొరత ఏర్పడింది. బాత్రా ఆస్పత్రికి డిమాండ్‌కు తగ్గట్టు ఆక్సిజన్‌ సరఫరా కావడం లేదు. 8వేల లీటర్ల ఆక్సిజన్‌ అవసరం కాగా కేవలం 500 లీటర్ల ఆక్సిజన్‌ మాత్రమే వస్తుండటంతో కరోనా రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం బాత్రా ఆస్పత్రిలో 350 మంది రోగులకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఆక్సిజన్‌పైనే కోవిడ్‌ రోగులకు చికిత్స ఆధారపడి ఉందని బాత్రా ఆస్పత్రి వైద్యులు తెలిపారు. ఆక్సిజన్‌ అందకపోతే కరోనా రోగుల పరిస్థితి విషమంగా ఉంటుందని వైద్యులు పేర్కొన్నారు.

జాతీయ పంచాయ‌తీరాజ్‌దినోత్స‌వం సంధర్భంగా స్వ‌మిత్వ ప‌థ‌కం ప్రారంభించనున్న ప్రధాని మోదీ, ప్రాప‌ర్టీకార్డుల‌ను అందుకోనున్న 4.09 ల‌క్ష‌ల మంది ఆస్తి స్వంత‌దారులు

కొన్ని రోజుల క్రితం కూడా ఇలాగే జరిగింది. ఢిల్లీలోని సర్ గంగారామ్ ఆస్పత్రిలో ఆక్సిజన్ కొరత ఏర్పడింది. దీంతో 25 మంది కరోనా రోగులు మరణించారు.సర్‌ గంగా రాం ఆస్పత్రి ఢిల్లీలో ప్రసిద్ది చెందిన ప్రైవేట్‌ హాస్పిటల్‌. ఇక్కడ 500 మంది కంటే ఎక్కువ మంది కోవిడ్‌ రోగులు చికిత్స పొందుతున్నారు. వీరిలో 142 మందికి ఎక్కువ మొత్తంలో ఆక్సిజన్‌ అవసరం ఉన్నట్లు వార్తలు వచ్చాయి.ఇందుకు సంబంధించిన ఫోటోలను న్యూస్‌ ఏజెన్సీ ఏఎన్‌ఐ ట్విట్టర్‌లో షేర్‌ చేసింది.