CM Revanth Reddy: ఎన్ని కష్టాలైనా మూసీని ప్రక్షాళన చేసి తీరుతాం...సంక్రాంతి తర్వాత రైతుల ఖాతాల్లో రైతు భరోసా నిధులు..స్పష్టం చేసిన సీఎం రేవంత్ రెడ్డి

మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టును పూర్తి చేసి నల్గొండ జిల్లాను అభివృద్ధి పథాన నడిపిస్తామని స్పష్టం చేశారు సీఎం రేవంత్ రెడ్డి. ఎంత ఖర్చయినా కానివ్వండి. ఎన్ని కష్టాలైనా రానివ్వండి. కాలుష్యం లేని, కలుషితం లేని నీరు ఇవ్వడం కోసం మూసీ ప్రక్షాళన చేసి తీరుతాం. మూసీ పునరుజ్జీవం బాధ్యత నాది. కలుషితాల నుంచి నల్గొండ నుంచి విముక్తి చేసే బాధ్యత నాది. అడ్డం వచ్చేవారి సంగతి చూసే బాధ్యత మీది అన్నారు.

CM Revanth Reddy again clarifies on Musi Prakshalana(X).jpg

Hyd, Dec 8:  మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టును పూర్తి చేసి నల్గొండ జిల్లాను అభివృద్ధి పథాన నడిపిస్తామని స్పష్టం చేశారు సీఎం రేవంత్ రెడ్డి. ఎంత ఖర్చయినా కానివ్వండి. ఎన్ని కష్టాలైనా రానివ్వండి. కాలుష్యం లేని, కలుషితం లేని నీరు ఇవ్వడం కోసం మూసీ ప్రక్షాళన చేసి తీరుతాం. మూసీ పునరుజ్జీవం బాధ్యత నాది. కలుషితాల నుంచి నల్గొండ నుంచి విముక్తి చేసే బాధ్యత నాది. అడ్డం వచ్చేవారి సంగతి చూసే బాధ్యత మీది అన్నారు.

ప్రజా పాలన – ప్రజా విజయోత్సవాలు కార్యక్రమంలో భాగంగా నల్గొండలో నిర్వహించిన సభలో మాట్లాడిన సీఎం రేవంత్... రైతుల సంక్షేమం, మూసీ పునరుజ్జీవం, నల్గొండ జిల్లా సమస్యలను ప్రధానంగా ప్రస్తావించారు. సంక్రాంతి పండుగ తర్వాత రైతుల ఖాతాల్లో రైతు భరోసా వేస్తామన్న విషయాన్ని పునరుద్ఘాటించారు. మూసీ ప్రక్షాళన చేయకపోతే నల్గొండ ప్రజలు జీవించలేని పరిస్థితులు తలెత్తబోతున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. ఫ్లోరైడ్ బారిన పడి నల్గొండ ప్రజలు అనేక విధాలుగా నష్టపోయారు.

మూసీలో కొట్టుకొచ్చే శవాలు, కళేబరాల నుంచి విముక్తి కలిగించి ఈ జిల్లాలో వ్యవసాయానికి, తాగునీటికి ఉపయోగపడే విధంగా గోదావరి నుంచి నీటిని తరలించి కృష్ణా నదిలో కలిసే వరకు ప్రాజెక్టును పూర్తి చేస్తాం అన్నారు. నల్గొండ జిల్లాలోని ప్రాజెక్టులు పూర్తి చేయడానికి ఎన్ని నిధులైనా మంజూరు చేయడానికి ప్రభుత్వం సిద్దంగా ఉందన్నారు. ఈ ప్రాంతానికి కృష్ణా నదీ జలాలను ప్రవహింపజేసి దేశానికే తలమానికంలా నిలబెట్టాలన్న ఆలోచన ప్రభుత్వం చేస్తోందన్నారు.

ప్రపంచంలోనే పొడవైన 44 కిలోమీటర్ల ఎస్ఎల్ బీసీ టన్నెల్ ను పూర్తి చేసి 3.5 లక్షల ఎకరాలకు సాగునీరు, 500 గ్రామాలకు తాగునీటిని ఇవ్వాలని ఆనాడు ప్రణాళికలు సిద్దం చేశాం అన్నారు. బ్రహ్మణవెల్లంల ఎత్తిపోతల ప్రాజెక్టు పూర్తి చేసి లక్ష ఎకరాలకు నీరివ్వాలని సంకల్పించాం. కానీ గడిచిన పదేళ్ల ప్రభుత్వంలో పూర్తిగా నిర్లక్ష్యానికి గురైందన్నారు. ప్రజా ప్రభుత్వం ఏర్పడి నేటికి సరిగ్గా ఏడాది పూర్తి చేసుకున్న సందర్బంగా పోరాటాల గడ్డ నల్గొండ జిల్లాలో ఉత్సవాలు చేసుకోవడం సంతోషకరం అన్నారు. తెలంగాణ కోసం మంత్రి పదవిని వదులుకున్న కోమటిరెడ్డి..నల్గొండ గాలి పీల్చుకుంటేనే సాయుధ పోరాటం గుర్తుకొస్తుందన్న సీఎం రేవంత్ రెడ్డి, కేసీఆర్ పాలనలో అభివృద్ధి శూన్యం అని మండిపాటు

21 వేల కోట్ల రూపాయలతో 25 లక్షల మంది రైతులకు 2 లక్షల మేరకు రుణమాఫీ చేశాం. ఒక్క నల్గొండ జిల్లాలోనే 2400 కోట్ల రూపాయల మేరకు రుణమాఫీ జరిగిందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. 66 లక్షల ఎకరాల్లో 1.53 కోట్ల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం పండించి దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది. ఇచ్చిన మాట ప్రకారం సన్నాలకు రూ. 500 బోనస్ ఇచ్చాం అన్నారు. అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదిలోనే ప్రభుత్వ పరంగా 55,143 ఉద్యోగాలు ఇచ్చిన చరిత్ర దేశంలోనే ఏ రాష్ట్రానికి లేదు అన్నారు. నల్గొండ రింగ్ రోడ్డును పూర్తి చేస్తాం. రీజినల్ రింగ్ రోడ్డుతో పాటు 50 వేల ఎకరాల్లో ఫోర్త్ సిటీని కట్టే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందన్నారు.

(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)

Share Now

సంబంధిత వార్తలు

Share Now