COVID-19 in India: భారతదేశంలో 42,836కి చేరిన కోవిడ్-19 బాధితులు, గడిచిన 24 గంటల్లో 2,573 పాజిటివ్ కేసులు నమోదు, 1389కి పెరిగిన కరోనా మృతుల సంఖ్య
దేశవ్యాప్తంగా నెలకు పైగా లాక్డౌన్ అమలులో ఉన్నప్పటికీ కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతూనే ఉన్నాయంటే కేంద్రం ప్రభుత్వం సీరియస్ గా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో కొన్నిచోట్ల సడలింపులు ఇవ్వడం, కొన్నిచోట్ల తరలింపులు చేయడం చేస్తున్నప్పుడు.....
New Delhi, May 4: భారతదేశంలో రోజురోజుకు పెరుగుతున్న కోవిడ్-19 కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. మొన్నటి వరకు రోజుకు వెయ్యికి పైగా కేసులు నమోదయితేనే అమ్మో అనుకున్న వేళ, ఇటీవల కాలంగా ఒక రోజులో కనీసం 2 వేలకు కేసులకు తక్కువగా పాజిటివ్ కేసులు నమోదవడం లేదు. దేశవ్యాప్తంగా నెలకు పైగా లాక్డౌన్ అమలులో ఉన్నప్పటికీ కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతూనే ఉన్నాయంటే కేంద్రం ప్రభుత్వం సీరియస్ గా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో కొన్నిచోట్ల సడలింపులు ఇవ్వడం, కొన్నిచోట్ల తరలింపులు చేయడం చేస్తున్నప్పుడు పరిస్థితులను మరింత ముదరకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలి, మార్గదర్శకాలు పక్డ్బందీగా అమలవుతున్నాయా? అనేది చూడాలి. అప్పుడే ఇంతకాలంగా అమలు చేసిన లాక్డౌన్ కు విలువ ఉంటుంది. మద్యం షాపుల ముందు మందు బాబుల క్యూ, భౌతిక దూరం బేఖాతర్
ఇక కేసుల విషయానికి వస్తే, గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా మరో 2,573 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో భారతదేశంలో మొత్తం COVID-19 బాధితుల సంఖ్య సోమవారం నాటికి 42,836 దాటింది. ఇదే సమయంలో కొత్తగా మరో 83 కోవిడ్ మరణాలు నమోదయ్యాయి, దీంతో ఈ వ్యాధి కారణంగా ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 1389 పెరిగింది.
ఇప్పటివరకు 11,761 మంది బాధితులు కోలుకొని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ కాగా, ప్రస్తుతం దేశంలో 29,685 యాక్టివ్ కేసులు ఉన్నాయని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో పేర్కొంది
మహారాష్ట్ర రాష్ట్రం కరోనా మహమ్మారి ధాటికి విలవిలలాడుతోంది. దేశవ్యాప్తంగా నమోదైన కేసుల్లో అత్యధికంగా ఈ రాష్ట్రంలోనే నమోదవుతున్నాయి. ఈరోజు ఉదయం నాటికి మహారాష్ట్రలో కోవిడ్-19 కేసుల సంఖ్య 11,500 దాటాయి. అలాగే మరణాల సంఖ్య 485కు పెరిగింది. మహారాష్ట్రలో నమోదైన మొత్తం పాజిటివ్ కేసుల్లో సుమారు 7,800 పైగా కేసులు, 295 మరణాలు ఒక్క ముంబై నగరంలోనే నమోదయ్యాయి.
అధికారిక గణాంకాల ప్రకారం కరోనావైరస్ వ్యాప్తి తీవ్రత అత్యధికంగా మహారాష్ట్రలో ఉంది. ఇక్కడ ఈరోజు వరకు 12,974 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత గుజరాత్ లో 5428, దిల్లీ 4549, తమిళనాడు 3023, మధ్యప్రదేశ్ 2942, రాజస్థాన్ 2886, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో 2,742 కేసులు నమోదయ్యాయి.
రాష్ట్రాల వారీగా కోవిడ్-19 గణాంకాలు ఇలా ఉన్నాయి:
S. No. | Name of State / UT | Total Confirmed cases (Including 111 foreign Nationals) | Cured/Discharged/Migrated | Death |
---|---|---|---|---|
1 | Andaman and Nicobar Islands | 33 | 32 | 0 |
2 | Andhra Pradesh | 1650 | 524 | 36 |
3 | Arunachal Pradesh | 1 | 1 | 0 |
4 | Assam | 43 | 32 | 1 |
5 | Bihar | 517 | 125 | 4 |
6 | Chandigarh | 94 | 19 | 0 |
7 | Chhattisgarh | 57 | 36 | 0 |
8 | Delhi | 4549 | 1362 | 64 |
9 | Goa | 7 | 7 | 0 |
10 | Gujarat | 5428 | 1042 | 290 |
11 | Haryana | 442 | 245 | 5 |
12 | Himachal Pradesh | 40 | 34 | 1 |
13 | Jammu and Kashmir | 701 | 287 | 8 |
14 | Jharkhand | 115 | 22 | 3 |
15 | Karnataka | 642 | 304 | 26 |
16 | Kerala | 500 | 401 | 4 |
17 | Ladakh | 41 | 17 | 0 |
18 | Madhya Pradesh | 2942 | 798 | 165 |
19 | Maharashtra | 12974 | 2115 | 548 |
20 | Manipur | 2 | 2 | 0 |
21 | Meghalaya | 12 | 0 | 1 |
22 | Mizoram | 1 | 0 | 0 |
23 | Odisha | 163 | 60 | 1 |
24 | Puducherry | 8 | 5 | 0 |
25 | Punjab | 1102 | 117 | 21 |
26 | Rajasthan | 2886 | 1356 | 71 |
27 | Tamil Nadu | 3023 | 1379 | 30 |
28 | Telengana | 1082 | 490 | 29 |
29 | Tripura | 16 | 2 | 0 |
30 | Uttarakhand | 60 | 39 | 1 |
31 | Uttar Pradesh | 2742 | 758 | 45 |
32 | West Bengal | 963 | 151 | 35 |
Total number of confirmed cases in India | 42836* | 11762 | 1389 |
భారతదేశంలో ప్రస్తుతం మూడవ విడత లాక్డౌన్ అమలులో ఉంది. COVID-19 వ్యాప్తి దృష్ట్యా ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ప్రకటనతో మార్చి 24 నుండి దేశవ్యాప్తంగా లాక్డౌన్ నిర్విరామంగా కొనసాగుతూనే ఉంది. అయితే కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం లాక్డౌన్ 3.0 లో దేశంలోని ఆయా ప్రదేశాల్లో కేసుల తీవ్రతను బట్టి రెడ్, ఆరెంజ్ మరియు గ్రీన్ అనే మూడు జోన్లుగా విభజించించి తదనుగుణంగా లాక్డౌన్ ఆంక్షల నుంచి కొన్ని సడలింపులు ప్రకటించింది.
(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)