Helmet Mandatory for Children: ఇకపై చిన్నారులకు కూడా హెల్మెట్ తప్పనిసరి! కొత్త రూల్స్ తెచ్చిన కేంద్రం, నాలుగేళ్లు దాటినవారికి హెల్మెట్ తప్పనిసరి చేస్తూ నిబంధనలు

వాహనదారుల భద్రత కోసం ప్రభుత్వం కొత్త కొత్త రూల్స్ తెస్తోంది. ఒకప్పుడు ద్విచక్ర వాహనం నడిపేవారు హెల్మెట్ (Helmet) పెట్టుకోవాలనే రూల్ లేదు. కానీ హెల్మెట్ (Helmet) తప్పనిసరి అనే రూల్ తెచ్చింది ప్రభుత్వం. ఆ తరువాత నడపేవారే కాదు వెనుక కూర్చున్నవారు కూడా హెల్మెట్ పెట్టుకోవాల్సిందేనని రూల్ తీసుకొచ్చింది.

New Delhi, Feb 16: వాహనదారుల భద్రత కోసం ప్రభుత్వం కొత్త కొత్త రూల్స్ తెస్తోంది. ఒకప్పుడు ద్విచక్ర వాహనం నడిపేవారు హెల్మెట్ (Helmet) పెట్టుకోవాలనే రూల్ లేదు. కానీ హెల్మెట్ (Helmet) తప్పనిసరి అనే రూల్ తెచ్చింది ప్రభుత్వం. ఆ తరువాత నడపేవారే కాదు వెనుక కూర్చున్నవారు కూడా హెల్మెట్ పెట్టుకోవాల్సిందేనని రూల్ తీసుకొచ్చింది. తాజాగా మరో కొత్త నిబంధన (notified new rules) తీసుకురాబోతోంది. ద్విచక్ర వాహనం (motorcycles) నడిపేవారితో పాటు దానిపై ప్రయాణించే చిన్నారులు కూడా హెల్మెట్ తప్పనిసరి చేసింది. హెల్మెట్ అంటే పెద్దగా ఉంటుంది. చిన్నపిల్లలకు అది సెట్ కాదు. అందుకే..ప్రభుత్వం పిల్లలకు కూడా వారి సైజు ప్రకారం హెల్మెట్‌లను (Helmet) తయారు చేయాలని హెల్మెట్ తయారీదారులను కోరింది.

ప్రమాదాల్లో గాయాల నుంచి కాపాడుకునేందుకు హెల్మెట్ ఎంతగానో ఉపయోగపడుతుందనే విషయం తెలిసిందే. అందుకే హెల్మెట్ తప్పనిసరి అనే రూల్ తీసుకొచ్చింది ప్రభుత్వం. వాహనాలపై ప్రయాణించే పెద్దలకు మాత్రమే హెల్మెట్ ధరించాలనే నియమం ఉండేది. కానీ.. ఇవాళ కేంద్రం కొత్తగా మరిన్ని నిబంధనలను ప్రకటించింది. భారత్‌లో ద్విచక్ర వాహనాలపై ప్రయాణించే చిన్నారులకు సైతం హెల్మెట్‌ను తప్పనిసరని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. పిల్లలకు కూడా వారి సైజు ప్రకారం హెల్మెట్‌లను తయారు చేయాలని హెల్మెట్ తయారీదారులను ఈ మేరకు ప్రభుత్వం కోరింది.

iSmart Bike: 'హీరో స్ల్పెండర్ ఐస్మార్ట్‌' బైక్ విడుదల, భారతదేశపు తొలి బిఎస్ 6 మోటారుసైకిల్ ఇదే, దీని ధర మరియు ఇతర విశేషాలు ఇలా ఉన్నాయి

అలాగే పిల్లల భద్రత కోసం.. భద్రతా జీనును (Safety harness) ధరించాలని మరోసారి సూచించింది. కొత్త నిబంధన ప్రకారం వీటిని ఉల్లంగించే వారిపై రూ. 1000 జరిమానాతో పాటు 3 నెలలు జైలు శిక్ష, డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేయబడతాయని కేంద్రం సుస్పష్టంగా తెలిపింది. సెంట్రల్ మోటార్ వెహికల్స్ రూల్స్ 1989 కి (Motor Vehicles Act) సవరణ ద్వారా కొత్త నియమాలు ప్రతిపాదించబడ్డాయి. కొత్తగా అమలులోకి రానున్న ఈ నిబంధనలు నాలుగు సంవత్సరాల వయస్సు పిల్లలకు వర్తించనున్నాయి.

పిల్లలతో సహా ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనం.. గంటకు గరిష్ఠంగా 40 కిమీ కంటే మించిన వేగంతో ప్రయాణించకూడదని సూచించింది. కొత్తగా తెస్తున్న ఈ చట్టాలపై పౌరుల అభిప్రాయాన్ని సేకరించేందుకు కేంద్ర ప్రభుత్వం అక్టోబర్ 2021 లో డ్రాఫ్ట్ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. పిల్లల హెల్మెట్‌లను తయారు చేయమని ప్రభుత్వం భారతీయ హెల్మెట్ తయారీదారులను కోరింది. వాటి సైజు ప్రకారం, సేఫ్టీ జీను ఒక జత పట్టీలతో రానుంది. అది భుజం లూప్‌లను ఏర్పరుస్తుంది. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS) ప్రకారం, జీను తక్కువ బరువు, సర్దుబాటు, వాటర్ ఫూఫ్ తో నాణ్యతగా ఉండాలని సూచించింది.

New Motor Vehicles Act 2019: గుజరాత్‌లో భారీ చలాన్ల నుండి ప్రజలకు ఊరట. నూతన మోటార్ వాహనాల చట్టాన్ని ఇంకా అమలు చేయని రాష్ట్రాలు ఇవే! నోట్ల రద్దును మించి ప్రజలను ఎక్కువగా బాధపెడుతున్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయం ఇదే!

ఈ పట్టీ..అధిక సాంద్రత కలిగిన ఫోమ్‌తో భారీ నైలాన్ లేదా మల్టీఫిలమెంట్ నైలాన్ మెటీరియల్‌ని ఉపయోగించి జీను తయారు చేయబడుతుంది. 30 కిలోల బరువును ఆపగలిగేదిగా ఉండాలి. నాలుగేళ్లలోపు పిల్లలకు ప్రభుత్వం నిర్దేశించిన ప్రమాణాలకు అనుగుణంగా క్రాష్ హెల్మెట్ లేదా సైకిల్ హెల్మెట్ ధరించటం ఇక తప్పనిసరి. లేదంటే చర్యలు తప్పదంటోంది ప్రభుత్వం.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement