Delhi Shocker: ఢిల్లీలో దారుణం, బిర్యానికి డబ్బులు ఇవ్వలేదని యువకుడిని 60 సార్లు కత్తితో పొడిచిన మరో యువకుడు, అంతటితో ఆగకుండా మృతదేహంపై..

దేశ రాజధాని ఢిల్లీలో (Delhi) దారుణ ఘటన చోటు చేసుకుంది. బిర్యానీకి (Biryani) పైసలు ఇవ్వలేదని 17 ఏండ్ల యువకుడిని ఓ 16 కుర్రాడు పొడిచి చంపాడు. యువకుని మెడ, ఛాతీపై 60 సార్లు పొడిచిన నిందితుడు.. నిర్జీవంగా పడి ఉన్న అతనిపైకి ఎక్కి డ్యాన్స్‌ చేశాడు.

Boy, 16, stabs 17-year-old over 60 times in brutal Delhi murder (photo-X/Video Grab)

Delhi, Nov 23: దేశ రాజధాని ఢిల్లీలో (Delhi) దారుణ ఘటన చోటు చేసుకుంది. బిర్యానీకి (Biryani) పైసలు ఇవ్వలేదని 17 ఏండ్ల యువకుడిని ఓ 16 కుర్రాడు పొడిచి చంపాడు. యువకుని మెడ, ఛాతీపై 60 సార్లు పొడిచిన నిందితుడు.. నిర్జీవంగా పడి ఉన్న అతనిపైకి ఎక్కి డ్యాన్స్‌ చేశాడు. ఘటన వివరాల్లోకెళితే.. బాధితుడైన 17 ఏండ్ల యువకుడు ఢిల్లీలోని జాఫ్రాబాద్‌ (Jafrabad) ప్రాంతంలో తన తల్లితో కలిసి ఉంటున్నాడు. రోజువారీ కూలీగా జీవనం గడుపుతున్నాడు.

మంగళవారం రాత్రి జనతా మజ్దూర్‌ కాలనీ మీదుగా (Janta Mazdoor Colony) వెళ్తున్నాడు. ఈ క్రమంలో ఓ 16 ఏండ్ల కుర్రాడు అతడిని అడ్డగించాడు. బిర్యానీ తినడానికి రూ.350 కావాలని ఆ యువకుడిని అడిగాడు. అయితే తన వద్ద అంత డబ్బు లేదని చెప్పడంతో ఆవేశానికి లోనైన ఆ కుర్రాడు అతడిని కొట్టాడు. దీంతో కిందపడిపోయిన బాధితుడిపై కూర్చున్న నిందితుడు.. మెడ, ఛాతీపై విచక్షణారహితంగా కత్తితో 60 సార్లు పొడిచాడు. తీవ్రంగా గాయపడిన అతడు చనిపోయాడు.

దారుణం, మైనర్ బాలికపై 70 ఏళ్ళ వృద్ధుడు అత్యాచారం, ఔటైన తర్వాత పురుషాంగం పట్టుకుని సైజ్ ఎలా ఉందో చెప్పాలంటూ వేధింపులు

అప్పటికీ శాంతించని ఆ నీచుడు అతని దేహంపై డ్యాన్స్‌ చేశాడు. గమనించిన స్థానికులు ఆ యువకుడిని సమీపంలోని ఆస్పత్రికు తీసుకెళ్లారు. అయితే అప్పటికే అతడు మృతిచెందాడని వైద్యులు తెలిపారు. ఇదంతా ఆ ప్రాంతంలో ఉన్న సీసీటీవీ కెమెరాలో రికార్డయింది.

ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. నిందితుడైన కుర్రాడు కూడా జఫ్రాబాద్‌లోని మురికివాడలో నివసిస్తున్నాడని, అతడు మధ్యలో పాఠశాల విద్యను ఆపేశాడని పోలీసులు చెప్పారు. ఇద్దరు ఒకరికొకరు తెలియరని వెల్లడించారు. గతంలోనూ అతనిపై ఓ హత్య కేసు ఉన్నదని తెలిపారు. నిందితుడి కోసం గాలిస్తున్నామని పోలీస్ అధికారులు తెలిపారు.

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

Family Dies By Suicide: హైదరాబాద్ లోని హబ్సిగూడలో పెను విషాదం.. కుమారుడికి విషమిచ్చి, కుమార్తెకు ఉరివేసి దంపతుల ఆత్మహత్య.. ఎందుకంటే?? (వీడియో)

Ranganath on Pranay Murder Case: కూతురు మీద ప్రేమతో మరో ఇంటి వ్యక్తిని చంపడం కరెక్ట్ కాదు, ప్రణయ్ హత్య కేసుపై స్పందించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్

Pranay 'Honour Killing' Case: ఆరేళ తర్వాత ప్రణయ్ హత్య కేసులో కీలక తీర్పు, ఒకరికి ఉరి, ఆరుగురికి జీవితఖైదు విధించిన నల్గొండ కోర్టు, 2018లో జరిగిన మిర్యాలగూడ పరువు హత్య కేసు వివరాలు ఇవే..

Chandrababu Launches Shakti Teams: శక్తి టీమ్స్‌ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు... మహిళా దినోత్సవం సందర్భంగా వివిధ కార్యక్రమాలకు శ్రీకారం, ప్రతీ గ్రామంలో అరకు కాఫీ ఔట్ లెట్స్‌ ఉండాలని వెల్లడి

Advertisement
Advertisement
Share Now
Advertisement