Delhi Shocker: మైనర్లా లేక కామాంధులా..బాలికను చీకటి ప్రదేశానికి తీసుకువెళ్లి సామూహిక అత్యాచారం, ఎవరికైనా చెబితే చంపేస్తామని బెదిరింపులు, నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు

వార్దిదరు ఆ బాలికపై సామూహిక లైంగిక దాడికి (raping neighbouring minor girl) పాల్పడ్డారు. ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తామని బెదిరించి వారు అక్కడ నుంచి పారిపోయారు. బాధితురాలు సాయంత్రం తిరిగి ఇంటికి వచ్చినప్పుడు, ఆమె తన కడుపు, ప్రైవేట్ భాగాలలో నొప్పి గురించి తన తల్లికి ఫిర్యాదు చేసి, తరువాత జరిగిన సంఘటన గురించి ఆమెకు చెప్పింది.

Representational Image (Photo Credits: File Image)

New Delhi, Jan 26: ఇద్దరు మైనర్లు ఎనిమిదేళ్ల బాలికపై లైంగికదాడికి పాల్పడిన దారుణ ఘటన (Delhi Shocker) ఈశాన్య ఢిల్లీలోని శాస్త్రి పార్క్ ప్రాంతంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సోమవారం మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో మైనర్‌ బాలిక తన ఇంటి బయట ఆడుకుంటుండగా, అదే ప్రాంతానికి చెందిన 12 ఏళ్ల బాలుడు ఆమెతో మాటలు కలిపి ఆడుకుందామని బాలికను ఎవరూ లేని చీకటి ప్రదేశానికి తీసుకెళ్లాడు. ఆ తర్వాత ఘటనా స్థలానికి మరో బాలుడు కూడా చేరుకున్నాడు.

అనంతరం వార్దిదరు ఆ బాలికపై సామూహిక లైంగిక దాడికి (raping neighbouring minor girl) పాల్పడ్డారు. ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తామని బెదిరించి వారు అక్కడ నుంచి పారిపోయారు. బాధితురాలు సాయంత్రం తిరిగి ఇంటికి వచ్చినప్పుడు, ఆమె తన కడుపు, ప్రైవేట్ భాగాలలో నొప్పి గురించి తన తల్లికి ఫిర్యాదు చేసి, తరువాత జరిగిన సంఘటన గురించి ఆమెకు చెప్పింది. దీంతో బాధితురాలి తల్లి ఈ ఘటనపై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.

కామంతో రగిలిన యువకుడు, అసహజ సెక్స్ చేయాలంటూ బాలుడిపై ఒత్తిడి, నో చెప్పడంతో దారుణంగా కత్తితో పొడిచి చంపేశాడు, నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు

కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇద్దరు మైనర్‌ బాలురను అదుపులోకి తీసుకుని (Two minor boys in Delhi arrested) జువైనల్ హోంకు తరలించారు. బాలిక పరిస్థితి విషమంగా ఉన్నందున, ఆమెను వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ఆమెకు శస్త్రచికిత్స అందించారు. ప్రస్తుతం ఐసీయూలో చికిత్స పొందుతున్న ఆమె పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెప్పారు.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement