Delhi Shocker: ఢిల్లీలో దారుణం, కామవాంఛలు తీర్చుకుంటూ 14 సార్లు బలవంతంగా అబార్షన్ చేయించిన ప్రియుడు, తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్న మహిళ, చనిపోయే ముందు సూసైడ్ నోట్ రాసిన బాధితురాలు

ఢిల్లీలోదారుణ ఘటన చోటు చేసుకుంది. ప్రియుడు ఎనిమిదేళ్ల సహజీవనంలో 14 సార్లు బలవంతంగా అబార్షన్ చేయించడంతో మనస్తాపంతో ఓ మహిళ ఆత్మహత్య (Woman commits suicide ) చేసుకుంది. ఢిల్లీలోని జైట్‌పూర్‌లో ఈ ఘటన (Delhi Shocker) చోటు చేసుకుంది.

Representational Image | (Photo Credits: IANS)

New Delhi, July 15: ఢిల్లీలోదారుణ ఘటన చోటు చేసుకుంది. ప్రియుడు ఎనిమిదేళ్ల సహజీవనంలో 14 సార్లు బలవంతంగా అబార్షన్ చేయించడంతో మనస్తాపంతో ఓ మహిళ ఆత్మహత్య (Woman commits suicide ) చేసుకుంది. ఢిల్లీలోని జైట్‌పూర్‌లో ఈ ఘటన (Delhi Shocker) చోటు చేసుకుంది. ఆత్మహత్యకు ముందు ఆమె హిందీలో రాసిన సూసైడ్ లేఖను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దాని ప్రకారం.. 33 ఏళ్ల బాధిత మహిళ 9 సంవత్సరాల నుంచి భర్తకు దూరంగా ఉంటోంది.

బీహార్‌కు చెందిన గౌతమ్ ఆమెతో పరిచయం పెంచుకుని పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. దీంతో ఇద్దరూ కలిసి సహజీవనం ప్రారంభించారు.ఈ క్రమంలో ఈ 8 సంవత్సరాల్లో 14 సార్లు ఆమెకు అబార్షన్ (forced to undergo abortion 14 times) చేయించాడు. అయినప్పటికీ పెళ్లి చేసుకునేందుకు నిరాకరించాడు. దీంతో తీవ్ర మనస్తాపం చెందిన బాధితురాలు ఈ నెల 5న ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. గౌతమ్ చేసిన తప్పులకు సంబంధించిన ఆధారాలు సేకరించానని, తన ఫోన్‌ను చెక్ చేయాలని కోరింది.

వీడు భర్తేనా.. పిల్లల ముందే భార్య గొంతు కోసి బాయిల్ చేశాడు, ఇతరులతో అక్రమ సంబంధాలు వద్దన్నందుకే ఈ కిరాతకం, పాకిస్తాన్ లో దారుణ ఘటన

నోయిడాలోని ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో పనిచేస్తున్న నిందితుడిపై ఆత్మహత్యకు ప్రేరేపించడం సహా పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. మరోవైపు, ఓ ప్రైవేటు సంస్థలో పనిచేస్తున్న బాధితురాలి భర్తను పిలిపించి పోలీసులు ప్రశ్నించారు. తామిద్దరం దాదాపు 8 ఏళ్ల నుంచి విడిగా ఉంటున్నట్టు ఆయన చెప్పాడని పోలీసులు తెలిపారు.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement