Karachi, July 14: పాకిస్తాన్‌లో దారుణం చోటు చేసుకుంది. దాయాది దేశంలో ఓ భర్త తన పిల్లల ముందే భార్య ను గొంతు కోసి, బాయిల్ (Pakistan Man Boils Wife) చేశాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సింథ్ ప్రావిన్స్‌కి చెందిన ఆషిక్ అనే వ్యక్తి ఒక ప్రైవేట్ పాఠశాలలో వాచ్‌మెన్‌గా పనిచేస్తున్నాడు.
అయితే భార్య ఆయన చెప్పిన పాడు పనికి నిరాకరించడంతో.. అతను తన ఆరుగురి పిల్లల ముందే (Front Of His Children) తన భార్య గొతుకోసి.. ఒక పెద్ద పాత్రలో వేసి బాయిల్ చేసి చంపాడు. ఈ దారుణ ఘటన తర్వాత ఆశిష్ తన ముగ్గురు పిల్లలను తీసుకుని పారిపోయాడు. మైనర్‌పై తెగబడిన నలుగురు కామాంధులు, బాలిక శీలానికి లక్ష రూపాయలు వెలకట్టిన గ్రామ పెద్దలు, పోలీసులకు తెలియడంతో నిందితులంతా కటకటాల్లోకి
ఐతే బాధితురాలి 15 ఏళ్ల కుమార్తె పోలీసులకు ఫోన్ చేసి చెప్పడంతో ఈ విషయం వెలుగు చూసింది. గుల్షన్-ఎ-ఇక్బాల్ ప్రాంతంలోని ఓ ప్రైవేట్ స్కూల్‌లోని వంటగదిలో బాధితురాలు నర్గీస్ మృతదేహాన్ని సింథ్ పోలీసులు గుర్తించారు. పోలీసులు విచారణలో ఆశిష్ తన భార్యను బాయిల్ చేయడానికి ముందే గొతు కొసి చంపినట్లు తేలిందని చెప్పారు.
అతను తన భార్యను అక్రమ సంబంధాలు పెట్టుకోమని బలవంతం చేశాడని, ఆమె అందుకు నిరాకరించడంతో ఈ ఘటనకు పాల్పడినట్లు అక్కడి మీడియా సంస్థల ద్వారా వార్తలు వెలువడుతున్నాయి. దీనిపై కచ్చితమైన కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. ప్రస్తుతం మిగిలిన ముగ్గురు పిల్లలు సంరక్షణ బాధ్యతలను పోలీసులు తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు.