Image Used for Representational Purpose Only | (Photo Credits: File Image)

Hyd, July 12: తెలంగాణలో మారేడుపల్లి ఎస్ఐ ఘటన మరువక ముందే మరో పోలీస్ అధికారి రాసలీలలు బయటకు వచ్చాయి. రూంలోకి దూరి మహిళ తలపై తుఫాకీ గురిపెట్టి అత్యాచారం చేసిన పోలీస్ అధికారిని సస్పెండ్ చేసి చర్లపల్లి జైలుకు పంపగా.. తాజాగా మరో పోలీసు అధికారి పెళ్లి పేరుతో పదేళ్లపాటు సహజీవనం (Vijay Kumar cheats and rapes woman) చేసి చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం.. మిర్యాలగూడ మండలం కాల్వపల్లితండాకు చెందిన ధీరావత్‌ ఝాన్సీ పంచాయతీ కార్యదర్శిగా పనిచేస్తుంది.తన దూరపు బంధువైన సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం దురాజ్‌పల్లికి చెందిన ధరావత్‌ విజయ్‌తో పదేళ్ల క్రితం పరిచయం ఏర్పడింది.

విజయ్‌ హైదరాబాద్‌లోని మల్కాజ్‌గిరిలో సీసీఎస్‌ ఎస్‌ఐగా (Malkajgiri CCS sub-inspector) విధులు నిర్వర్తిస్తున్నారు. వీరి పరిచయం కాస్తా ప్రేమగా మారింది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి పదేళ్లుగా హైదరాబాద్‌లోని ఎల్‌బీనగర్‌లో ఆమెతో సహజీవనం చేశారు. ఝాన్సీతో సహజీవనం చేస్తూనే ఆరేళ్ల క్రితం విజయ్‌ తన మేనమామ కూతురును వివాహం చేసుకోగా..వీరికి సంతానం కూడా కలిగింది. ఈ విషయం ఝాన్సీకి తెలిసి ఆమె వేరే వ్యక్తిని పెళ్లి చేసుకునేందుకు సంబంధాలు వెతుకుతుండగా.. మరో వివాహం చేసుకోవద్దని విజయ్‌ బెదిరిస్తూ వచ్చాడు.

తుఫాకీతో బెదిరించి మహిళపై పోలీస్ అధికారి అత్యాచారం, మాజీ సీఐకి 14 రోజులు రిమాండ్ విధించిన కోర్టు, రేప్ కేసులో పలు ఆధారాలు సేకరించిన పోలీసులు

ఇద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో సదరు మహిళ ఎల్‌బీనగర్‌ నుంచి వచ్చి చైతన్యనగర్‌లో నివాసం ఉంటోంది. అయినా విజయ్‌ బెదిరిస్తుండటంతో తనను మోసగించడమే కాకుండా వివాహం చేసుకోవద్దని, పెళ్లి సంబంధాలు చెడగొడుతూ తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నాడని ఈనెల 8వ తేదీ రాత్రి మిర్యాలగూడ పట్టణ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు విజయ్‌పై అత్యాచారం, చీటింగ్‌ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. విజయ్‌ను సస్పెండ్‌ చేయడంతో పాటు దీనిపై సమగ్ర దర్యాప్తునకు ఆదేశిస్తూ రాచకొండ సీపీ మహేశ్‌భగవత్‌ ఉత్తర్వులు జారీ చేశారు.