16-year-old minor was allegedly gang-raped (Photo-ANI)

Jashpur, July 13: దేశంలో కఠిన చట్టాలు తీసుకువచ్చినా మృగాళ్లలో మార్పు రావడం లేదు. మహిళ ఎక్కడ కనబడితే అక్కడ కామాంధులుగా మారిపోతున్నారు. తాజాగా ఛత్తీస్‌గఢ్‌లో (Chhattisgarh) ఓ మైనర్‌(16) బాలికపై నలుగురు వ్యక్తులు సామూహిక లైంగిక దాడికి (minor was allegedly gang-raped) పాల్పడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాధితురాలు ఈ నెల 9వ తేదీన తన తండ్రితో కలిసి బయటకు వెళ్తోంది. ఇంతలో ఇద్దరు వ్యక్తులు వారిని అడ్డుకున్నారు. అనంతరం ఆమె తండ్రిపై (Victim Father) దాడి చేసి.. మైనర్‌ను సమీప అటవీ ప్రాంతంలోకి ఎత్తుకెళ్లారు.

అటవీ ప్రాంతంలో అంతకుముందే ఉన్న మరో ఇద్దరు వారితో కలిసి.. మైనర్‌ బాలికపై లైంగిక దాడికి (gang-raped) పాల్పడ్డారు. తర్వాత ఆమెను అటవీ ప్రాంతంలోనే వదిలి వెళ్లిపోయారు. ఈ దారుణాన్ని బాధితురాలు తండ్రి గ్రామ పంచాయతీ పెద్దల దృష్టికి తీసుకెళ్లాడు. ఈ క్రమంలో ఊరి పెద్దలు పంచాయితీ పెట్టారు. జరిగిన విషయం ఎంతో బాధాకరం. జరిగిందేదో జరిగిపోయింది.. బాధిత కుటుంబానికి నష్ట పరిహారం కింద నిందితులు రూ.లక్ష ఇవ్వాలని తీర్మానించారు.

కామాంధుడైన మరో పోలీస్ అధికారి, యువతిని బెదిరిస్తూ పదేళ్లుగా కోరికలు తీర్చుకున్న ఎస్ఐ, నీకు పెళ్ళి వద్దు నాతోనే ఉండాలంటూ బెదిరింపులు, అధికారిని సస్పెండ్ చేసిన రాచకొండ సీపీ

ఈ విషయం పోలీసుల దాకా పోవద్దని ఇక్కడితోనే ముగిసిపోవాలని ఇరు వర్గాలను పంచాయితీ పెద్దలు కోరారు.అయితే జరిగిన ఘటన గురించి పోలీసులకు తెలియడంతో నిందితులపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. అనంతరం, బాలికను వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించినట్టు జిల్లా అడిషనల్‌ ఎస్పీ ప్రతిభా పాండే చెప్పారు.