J and K Internet-Dirty Films: పోర్న్ సినిమాల కోసమే అక్కడ ఇంటర్నెట్, జమ్మూకాశ్మీర్‌లో ఇంటర్నెట్ నిషేధంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నీతి ఆయోగ్ సభ్యుడు వీకే సారస్వత్, ఇంటర్నెట్ దుర్వినియోగం చేస్తున్నారన్న వార్తలతో అక్కడ తాత్కాలికంగా సేవల నిలిపివేత
అక్కడ ఇంటర్నెట్ లో(Internet) ఎక్కువగా వారు బూతు సినిమాలు (Dirty Films)చూస్తారు. అంతే తప్ప అక్కడ మరేమి చేయరంటూ నీతి ఆయొగ్ సభ్యుడు వీకే సారస్వత్ ( V.K. Saraswat)సంచలన వ్యాఖ్యలు చేశారు. జమ్మూకశ్మీర్‌లో ఇంటర్నెట్ సేవలను నిలిపివేయడంపై ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
Srinagar, January 19: జమ్మూకాశ్మీర్‌లో(Jammu and Kashmir) ఇంటర్నెట్ నిలిపివేయడం వల్ల ప్రభుత్వానికి ఎటువంటి నష్టం లేదు. అక్కడ ఇంటర్నెట్ లో(Internet) ఎక్కువగా వారు బూతు సినిమాలు (Dirty Films)చూస్తారు. అంతే తప్ప అక్కడ మరేమి చేయరంటూ నీతి ఆయోగ్ సభ్యుడు వీకే సారస్వత్ ( V.K. Saraswat)సంచలన వ్యాఖ్యలు చేశారు.
జమ్మూకశ్మీర్‌లో ఇంటర్నెట్ సేవలను నిలిపివేయడంపై ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఇంటర్నెట్ సేవలను నిలిపివేయడంతో అక్కడ ఎలాంటి ఆర్థిక నష్టాలు లేవని తేల్చిచెప్పారు. ఇంటర్నెట్ సేవలను నిలిపివేయడం(internet ban) అసలు విషయమే కాదని అన్నారు.
ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, వదంతులు వ్యాప్తి కాకుండా ఉండేందుకే అక్కడ ఇంటర్నెట్ సేవలను నిలిపివేశామని ఆయన స్పష్టం చేశారు. రాజకీయ నాయకులు కశ్మీర్‌లో ఢిల్లీ తరహా నిరసనలను సృష్టించి, వాటికి సోషల్ మీడియా ద్వారా మరింత ఆజ్యం పోయడానికి ప్రయత్నిస్తున్నారని వీకే సారస్వత్ తీవ్రంగా ఆరోపించారు.
5 నెలల తర్వాత జమ్మూకశ్మీర్‌లో ప్రారంభమైన ఇంటర్నెట్ సేవలు
ఈ నేపథ్యంలోనే ఆయన జమ్మూకాశ్మీర్ లో ఇంటర్నెట్ వాడకం బూతు సినిమాలు చూడటం తప్పించి మరేమి చూడరనే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
జమ్మూకాశ్మీర్ రాష్ట్రాన్ని కేంద్రపాలిత ప్రాంతంగా మారుస్తూ నిర్ణయం తీసుకున్న మోడీ సర్కార్
కాగా కశ్మీర్‌లోని ఎనిమిది జిల్లాల్లో మొబైల్ ఇంటర్నెట్ సేవలను తాత్కాలికంగా నిలిపివేస్తూ కేంద్రం తాజాగా నిర్ణయం తీసుకుంది. సంఘ వ్యతిరేక శక్తులు ఇంటర్నెట్‌ను దుర్వినియోగం చేస్తున్నాయని, ప్రజల్లో భయాందోళనలను సృష్టించేందుకు, ఉగ్రవాద కార్యకలాపాల కోసం ఇంటర్నెట్‌ను వాడుతున్నాయని సమాచారం అందడంతో తాత్కాలికంగా నిలిపివేశామని అధికారులు వెల్లడించిన విషయం తెలిసిందే.
కేంద్ర పాలిత ప్రాంతాలుగా అవతరించిన జమ్మూ కాశ్మీర్ మరియు లద్దాఖ్
శ్రీనగర్, బుడ్గాం, గాందర్బల్, బారాముల్లా, అనంత్‌నాగ్, కుల్గాం, షోపియాన్, పుల్వామాల్లో మొబైల్ ఇంటర్‌నెట్ కనెక్టివిటీని నిలిపివేశామని జమ్మూకశ్మీర్ ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి షలీన్ కాబ్రా ఓ ప్రకటనలో తెలిపారు. అయితే జమ్మూ ప్రాంతంలోని పది జిల్లాల్లోనూ, కశ్మీర్‌లోయలోని కుప్వారా, బందీపొర జిల్లాల్లో పోస్ట్‌పెయిడ్ వినియోగదారులకు 2జీ మొబైల్ డేటా సేవలను పునరుద్ధరిస్తామని ఆయన చెప్పారు.
భారీ ఉగ్ర కుట్రను భగ్నం చేసిన శ్రీనగర్ పోలీసులు
ఫిక్స్‌డ్ లైన్ ఇంటర్‌నెట్ కనెక్టివిటీని అందించాలని సర్వీస్ ప్రొవైడర్లకు ఆదేశాలు జారీ చేశామని తెలిపారు. దీంతోపాటు జమ్మూకశ్మీర్ వ్యాప్తంగా అన్ని ప్రీపెయిడ్ సిమ్ కార్డులపై వాయిస్, ఎస్‌ఎంఎస్ సేవలను పునరుద్ధరించామని, ఇటువంటి సిమ్ కార్డులపై సేవలు అందించేందుకు సబ్‌స్ర్కైబర్ల వివరాలను టెలికాం సర్వీస్ ప్రొవైడర్లు క్షుణ్ణంగా తనిఖీ చేయాలని ఆయన సూచించారు.