Major Terror Attack Averted: భారీ ఉగ్ర కుట్రను భగ్నం చేసిన శ్రీనగర్ పోలీసులు, జైషే మహ్మద్‌ ఉగ్రవాద మూక అరెస్ట్, భారీ పేలుడు పదార్ధాలు స్వాధీనం,వెల్లడించిన జమ్మూ కశ్మీర్‌ డీజీపీ దిల్బాగ్‌ సింగ్‌
Jammu & Kashmir Police Bust Jaish Module, Arrest Five Terrorists in Srinagar (photo-ANI)

Srinagar, January 17: దేశంలో భారీ పేలుళ్లకు ఉగ్రవాదులు జరిపిన కుట్రలను జమ్మూ కాశ్మీర్ పోలీసులు( Jammu & Kashmir Cops) భగ్నం చేశారు. రిపబ్లిక్ డేకి (Republic Day 2020)ముందు భారీ పేలుళ్లు జరపాలని జైషే మహ్మద్‌ ఉగ్రవాద (Jaish-e-Mohammed)మూకలు చేసిన ప్రయత్నాలను పోలీసులు తిప్పి కొట్టారు.

పాక్‌ ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్‌కు చెందిన ఐదుగురు ఉగ్రవాదులను పోలీసులు గురువారం అరెస్ట్‌ చేశారు. గత ఏడాది ఫిబ్రవరిలో పుల్వామా దాడితో 40 మంది జవాన్లను బలితీసుకున్న జైషే మహ్మద్‌ భారత్‌లో పలు ఉగ్రదాడులకు పాల్పడిన సంగతి తెలిసిందే.

ఇక జైషే ఉగ్రవాదులను అరెస్ట్‌ చేసిన పోలీసులు ఆ ప్రాంతంలో భారీ పేలుడు పదార్ధాలను స్వాధీనం చేసుకున్నారు. అరెస్టయిన ఉగ్రవాదులను అజీజ్‌ అహ్మద్‌ షేక్‌, ఉమర్‌ హమీద్‌ షేక్‌, ఇంతియాజ్‌ అహ్మద్‌ చిక్లా, సహిల్‌ ఫరూక్‌ గోజ్రి, నజీర్‌ అహ్మద్‌ మిర్‌గా గుర్తించారు. జైషే శిబిరాన్ని భగ్నం చేయడం ద్వారా శ్రీనగర్‌ పోలీసులు భారీ ఉగ్రదాడి ప్రమాదం నుంచి తప్పించారని జమ్మూ కశ్మీర్‌ డీజీపీ దిల్బాగ్‌ సింగ్‌ (DGP Dilbagh Singh)పేర్కొన్నారు.

భారత్ రానున్న పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్?

ఉగ్రవాదుల నుంచి రిమోట్‌ కంట్రోల్‌ ఐఈడీతో పాటు 140 గిలెటిన్‌ స్టిక్స్‌, 40 డిటోనేటర్లను పోలీసులు సీజ్‌ చేశారు. వాకీ టాకీలు, ఆయుధాలు, డిటోనేటర్లు, జిలెటిన్‌ స్టిక్స్‌, నైట్రిక్‌ యాసిడ్‌ బాటిల్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఇటీవలే వీరు హజ్రత్బాల్‌ ప్రాంతంలో గ్రైనేడ్‌ దాడికి పాల్పడ్డారు.

Update by ANI

కొద్ది రోజుల కిందట గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ నెల 26వతేదీన ఢిల్లీ, గుజరాత్ ప్రాంతాల్లో ఉగ్ర దాడులు చేసేందుకు పాకిస్థాన్‌కు చెందిన ఇంటర్ సర్వీసెస్ ఇంటలిజెన్స్ (ఐఎస్ఐ)కుట్ర పన్నిందని ఢిల్లీ పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. ఐఎస్ఐఎస్‌కు చెందిన ఆరుగురు ఉగ్రవాదులు తమిళనాడు రాష్ట్రం తిరువల్లూరు ఈస్ట్ జిల్లాకు చెందిన హిందూ మున్నానీ నాయకుడు కేపీ సురేష్ హత్య కేసులో నిందితులని పోలీసుల దర్యాప్తులో తేలింది.

పార్లమెంట్ ఓకే అంటే పీఓకే మనదే

ఈ ఆరుగురు ఉగ్రవాదులు తమిళనాడు నుంచి నేపాల్‌లో తలదాచుకొని అక్కడి నుంచి మన దేశంలోకి ప్రవేశించారని పోలీసు వర్గాలకు సమాచారం అందింది. ఈ ఆరుగురు ఉగ్రవాదుల్లో ముగ్గురిని ఢిల్లీ స్పెషల్ పోలీసు విభాగం ఈ నెల 9వతేదీన అరెస్ట్ చేసింది. వారినుంచి తుపాకులు, మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు.మళ్లీ మరో ఐఎస్ఐఎస్ ఉగ్రవాదిని గుజరాత్ పోలీసులు అరెస్ట్ చేశారు.

J&K Police Tweet

పరారీలో ఉన్న మరో ఇద్దరు ఉగ్రవాదులు ఉగ్ర దాడులు జరిపేందుకు విదేశీయుల సహకారం తీసుకుంటున్నారని పోలీసులకు సమాచారం అందింది. పరారీలో ఉన్న ఐఎస్ఐఎస్ ఇద్దరు ఉగ్రవాదులు ప్రస్థుతం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోకి ప్రవేశించారని తమకు ఇంటలిజెన్స్ వర్గాల నుంచి సమాచారం అందిందని ఐజీ అశుతోష్ కుమార్ ధ్రువీకరించారు.

నూతన ఆర్మీ జనరల్‌ ఎమ్‌ ఎమ్ నరవణే

ఖాజా మొయినుద్దీన్, అబ్దుల్ సమద్ లనే ఉగ్రవాదులు గతంలో పశ్చిమబెంగాల్ రాష్ట్రంలోని సిలిగురిలో ఉన్నారని సమాచారం. 2017లో ఉగ్రవాది ఖాజామొయినుద్దీన్ ను నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అధికారులు చెన్నైలో అరెస్టు చేశారు. మొయినుద్దీన్ ఐఎస్ఐఎస్ ఉగ్రవాద సంస్థలో దక్షిణాది రాష్ట్రాల్లో క్రియాశీలకంగా పనిచేస్తున్నాడని తేలింది.

ఎవరీ నూతన సైన్యాధిపతి మనోజ్‌ ముకుంద్‌?

పోలీసులు అరెస్టు చేసిన ఉగ్రవాది గణతంత్ర దినోత్సవం సందర్భంగా జనవరి 26వతేదీన ఢిల్లీలో దాడులకు ప్రణాళిక రూపొందించారని వెల్లడించాడు. పాక్ ఐఎస్ఐ ఢిల్లీలో ఉగ్ర దాడులు జరిపేందుకు కుట్రపన్నిందని తేలడంతో పోలీసులు హైఅలర్ట్ ప్రకటించారు. దీంతో పరారీలో ఉన్న మిగిలిన ఇద్దరు ఉగ్రవాదుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.

అమ్మాయిలతో రాసలీలలు సాగించేలా భారత గూఢాచారులు ఉండరు

పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు పోలీసు, ఆర్మీ రిక్రూట్ మెంట్ క్యాంపులు, హిందూ, ఆర్ఎస్ఎస్ నాయకులు లక్ష్యంగా చేసుకొని దాడులు చేసే అవకాశముందని ఇంటలిజెన్స్ చేసిన హెచ్చరికలతో పోలీసులు అప్రమత్తమయ్యారు.