Divorce Case: నల్లగా, లావుగా ఉన్నావంటూ భార్య వ్యాఖ్యలు.. విడాకులు కోరిన భర్తకు ఛత్తీస్‌గఢ్ హైకోర్టు షాక్

కేవలం భర్తను 'నల్లగా, లావుగా' ఉన్నావని పిలిచినంత మాత్రాన అది మానసిక క్రూరత్వం కిందకు రాదని, విడాకులు మంజూరు చేయడానికి తగిన కారణం కాదని ఛత్తీస్‌గఢ్ హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. సరైన ఆధారాలు లేకుండా చేసే ఆరోపణల ఆధారంగా పెళ్లిని రద్దు చేయలేమని స్పష్టం చేస్తూ, విడాకులు కోరుతూ భర్త దాఖలు చేసిన అప్పీల్‌ను ధర్మాసనం కొట్టివేసింది.

Chhattisgarh High Court

Divorce Case: కేవలం భర్తను 'నల్లగా, లావుగా' ఉన్నావని పిలిచినంత మాత్రాన అది మానసిక క్రూరత్వం కిందకు రాదని, విడాకులు మంజూరు చేయడానికి తగిన కారణం కాదని ఛత్తీస్‌గఢ్ హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. సరైన ఆధారాలు లేకుండా చేసే ఆరోపణల ఆధారంగా పెళ్లిని రద్దు చేయలేమని స్పష్టం చేస్తూ, విడాకులు కోరుతూ భర్త దాఖలు చేసిన అప్పీల్‌ను ధర్మాసనం కొట్టివేసింది. జస్టిస్ పార్థ్ ప్రతీమ్ సాహు, జస్టిస్ సచిన్ సింగ్ రాజ్‌పుత్‌లతో కూడిన డివిజన్ బెంచ్.. ఆకాష్ ఘోష్ వర్సెస్ పూజా సీట్ కేసులో ఈ ఉత్తర్వులు జారీ చేసింది. వీడియో ఇదిగో.. ఈ తల్లి ధైర్యానికి హ్యాట్సాఫ్.. రైలు ఢీకొట్టేంత దగ్గరగా వచ్చినా తన పిల్లలను కాపాడుకుంది..

మార్చి 7, 2019న వివాహం చేసుకున్న ఈ దంపతుల మధ్య త్వరలోనే విభేదాలు ప్రారంభమయ్యాయి. తన రూపురేఖలను చూసి భార్య హేళన చేసేదని, దురుసుగా ప్రవర్తిస్తూ తప్పుడు కేసుల్లో ఇరికిస్తానని బెదిరించేదని భర్త కోర్టును ఆశ్రయించాడు. అయితే, భార్య ఈ ఆరోపణలను ఖండిస్తూ భర్తకు మరొక మహిళతో అక్రమ సంబంధం ఉందని, గర్భవతిగా ఉన్న సమయంలో తనను హింసించి అత్తమామలు ఇంటి నుండి గెంటేసారని ఆరోపించింది.

కోర్టు కీలక వ్యాఖ్యలు:

ఆధారాలు తప్పనిసరి: మానసిక క్రూరత్వం లేదా విడిచిపెట్టి వెళ్లడం (Desertion) వంటి ఆరోపణలను పక్కా ఆధారాలతో నిరూపించడంలో భర్త విఫలమయ్యాడని హైకోర్టు పేర్కొంది.

సుప్రీం కోర్టు తీర్పు ప్రస్తావన: మానసిక క్రూరత్వానికి ఒకే విధమైన కొలమానం ఉండదని పేర్కొంటూ చారిత్రాత్మక సమర్ ఘోష్ వర్సెస్ జయ ఘోష్ (2007) కేసు తీర్పును బెంచ్ ఉటంకించింది.

ఫ్యామిలీ కోర్టు నిర్ణయం సమర్థన: జాంజ్‌గిర్ ఫ్యామిలీ కోర్టు గతంలో ఇచ్చిన తీర్పును సమర్థిస్తూ, భర్త పిటిషన్‌ను కొట్టివేసింది. అంతేకాకుండా, భార్య తల్లిదండ్రులు ఇచ్చిన కట్నం, బహుమతులను తిరిగి అప్పగించాలని ఆదేశించింది.

Share Now
Advertisement


Advertisement
Share Now
Advertisement