ED Notice To MLC Kavita Husband: ఎమ్మెల్సీ కవిత అరెస్టులో మరో ట్విస్ట్, కవిత భర్త అనిల్ కు ఈడీ నోటీసులు జారీ, సోమవారం విచారణకు రావాలంటూ పిలుపు
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత భర్త అనిల్‌కు (Kavita Husband Anil) ఈడీ నోటీసులు (ED Notice) జారీ చేసింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవితను ఈడీ కస్టడీకి అప్పగిస్తూ ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఆ కొద్దిసేపటికే కవిత భర్తకు నోటీసులు జారీ చేసిన ఈడీ అధికారులు సోమవారం విచారణకు హాజరుకావాలని ఆదేశించారు
New Delhi, March 16: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత భర్త అనిల్‌కు (Kavita Husband Anil) ఈడీ నోటీసులు (ED Notice) జారీ చేసింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవితను ఈడీ కస్టడీకి అప్పగిస్తూ ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఆ కొద్దిసేపటికే కవిత భర్తకు నోటీసులు జారీ చేసిన ఈడీ అధికారులు సోమవారం విచారణకు హాజరుకావాలని ఆదేశించారు. అలాగే, కవిత పీఆర్వో రాజేశ్‌తో పాటు ముగ్గురు అసిస్టెంట్లకు కూడా నోటీసులు పంపింది.
కవిత ఇంట్లో సోదాలు చేసిన వేళ ఐదుగురి సెల్‌ఫోన్లను ఈడీ అధికారులు సీజ్ చేశారు. ఈడీ కస్టడీలో కవితను కలిసేందుకు తొమ్మిది మందికి అనుమతి దక్కింది. అందులో నలుగురు కుటుంబ సభ్యులు ఉన్నారు. అలాగే, కవితను కలిసేందుకు ముగ్గురు పీఏలు, ఇద్దరు న్యాయవాదులకు అనుమతి దక్కింది.
Tags
Advertisement
సంబంధిత వార్తలు
Health Tips: వెన్ను నొప్పి సమస్యతో బాధపడుతున్నారా అయితే ఈ వ్యాధి కారణం కావచ్చు జాగ్రత్తగా ఉండండి.
Health Tips: మలబద్దకం గ్యాస్ సమస్యతో బాధపడుతున్నారా ఈ ఆహారాలతో మీ సమస్యకు చిటికెలో పరిష్కారం.
Health Tips: పిండిని ఫ్రిజ్‌లో పెట్టి వాడుతున్నారా అయితే దీనివల్ల వచ్చే అనర్ధాలేంటో తెలుసా.
Accident Averted at Hyderabad Airport: వీడియో ఇదిగో, శంషాబాద్ ఎయిర్‌పోర్టులో విమానానికి తప్పిన పెను ప్రమాదం, 150 మంది ప్రయాణికులు సేఫ్
Advertisement
Advertisement
Advertisement