Fire Accident In Train Viral Video: రైలింజన్ లో మంటలు, ప్యాసింజర్ల సాయంతో తప్పిన పెను ప్రమాదం, ఇంజన్ నుంచి రైలు బోగీలను వేరు చేసిన ప్యాసింజర్లు, వైరల్ వీడియో...

ప్యాసింజర్ రైల్ ఇంజిన్ లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఆ సమయంలో రైలు స్టేషన్ లో ఆగి ఉండటంతో తృటిలో పెనుప్రమాదం తప్పినట్లయింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లోని మీరట్ జిల్లా దౌరాలా రైల్వే స్టేషన్లో జరిగింది.

Fire breaks out in engine & two compartments of Saharanpur-Delhi train at Daurala railway station near Meerut.

మీరట్, మార్చ్ 05 : ప్యాసింజర్ రైల్ ఇంజిన్ లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఆ సమయంలో రైలు స్టేషన్ లో ఆగి ఉండటంతో తృటిలో పెనుప్రమాదం తప్పినట్లయింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లోని మీరట్ జిల్లా దౌరాలా రైల్వే స్టేషన్లో జరిగింది. దౌరాలా స్టేషన్లో ఆగి ఉన్న సహరాన్ పూర్ - ఢిల్లీ ప్యాసింజర్ రైలు ఇంజన్ లో, దాని వెనకున్న రెండు కోచ్ లలో మంటలు చెలరేగాయి. ఆ సమయంలో రైలు ఆగి ఉండటంతో ప్రయాణికులంతా ప్రాణాలతో బయటపడ్డారు. ఇంజన్ తో పాటు మరో రెండు బోగీలకు వ్యాపించిన మంటలు.. రైలు మొత్తానికి వ్యాపించకుండా ప్రయాణికులే బోగీలను వేరు చేయడం విశేషం.

ప్రమాదకరమైన పరిస్థితుల్లో ప్రయాణికులు ఈ సాహసం చేయగా.. దానిని కొందరు వీడియో తీసి నెట్టింట్లో పోస్ట్ చేశారు. ఆ వీడియో కాస్తా వైరల్ అయింది. ప్రయాణికుల సాహసాన్ని నెటిజన్లు అభినందిస్తున్నారు. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని, ప్రాణనష్టం జరగలేదని రైల్వే అధికారులు తెలిపారు.

కాగా.. రైలింజన్లో మంటలు చెలరేగడానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదని ఇండియన్ రైల్వేస్ ట్రాఫిక్ ఇన్ స్పెక్టర్ వైకె ఝా తెలిపారు.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement