Gold Rates Today: బంగారం కొనేవారికి షాకింగ్ న్యూస్, భారీగా పెరిగిన ధరలు, రానున్న రోజుల్లో కూడా పెరిగే అవకాశం, ఈ రోజు మార్కెట్లో ధరలు ఎలా ఉన్నాయో చూడండి

గత కొద్ది రోజులుగా బంగారం ధరలు స్థిరంగా వున్నాయి. కాగా రెండు రోజుల వ్యవధిలోనే బంగారం ధరలు (Gold Rates Today) సుమారు రూ. 500 వరకు పెరిగాయి.

Gold Rates Today (Photo-IANS)

మీరు బంగారం కొనాలని చూస్తున్నారా? అయితే, మీకు షాకింగ్ న్యూస్. గత కొద్ది రోజులుగా బంగారం ధరలు స్థిరంగా వున్నాయి. కాగా రెండు రోజుల వ్యవధిలోనే బంగారం ధరలు (Gold Rates Today) సుమారు రూ. 500 వరకు పెరిగాయి. ఏప్రిల్ 15 నాటికి, భారతదేశంలో 24 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) బంగారం ధర (Gold price today) రూ. 54,060 కాగా, 22 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) రూ. 49,550గా ఉంది. గత 24 గంటల్లో 24 క్యారెట్ల, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 22 క్యారెట్ల (10 గ్రాములు) 200 రూపాయలు మరియు 24 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) 240 రూపాయలు పెరిగింది. నిన్న భారతదేశంలో 24 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) బంగారం ధర రూ. 53,840 కాగా, 22 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) రూ. 49,350గా ఉంది.

గత 24 గంటల్లో భారతదేశంలోని వివిధ మెట్రో నగరాల్లో బంగారం ధరల్లో స్వల్ప హెచ్చుతగ్గులు కనిపించాయి. ఈరోజు చెన్నైలో 24 క్యారెట్ల (10 గ్రాములు) బంగారం ధర రూ.54,600 కాగా, 22 క్యారెట్లు (10 గ్రాములు) రూ.50,050గా ఉంది. దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల (10 గ్రాములు) బంగారం ధర రూ. 54,060 కాగా, 22 క్యారెట్లు (10 గ్రాములు) రూ. 49,550. కోల్‌కతాలో 24 క్యారెట్ల (10 గ్రాములు) బంగారం ధర రూ. 54,060 కాగా, 22 క్యారెట్లు (10 గ్రాములు) రూ. 49,550. మరోవైపు ముంబైలో 24 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) ధర రూ.54,060 కాగా, 22 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) రూ.49,550గా ఉంది. భువనేశ్వర్‌లో 24 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) రూ.54,060 కాగా, 22 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) రూ.49,550. గత 24 గంటల్లో బంగారం ధర 24 క్యారెట్ల (10 గ్రాములు) రూ.220, 22 క్యారెట్ల (10 గ్రాములు) రూ.200 పెరిగింది.

పీఎం కిసాన్ పథకం అలర్ట్, ఈ రైతులంతా పీఎం కిసాన్ పథకానికి అనర్హులంటూ కేంద్రం కీలక ప్రకటన, వారి నుండి డబ్బు వెనక్కి తీసుకోవాలని రాష్ట్రాలకు ఆదేశాలు

అమెరికా ద్రవ్యోల్బణ గణాంకాలు, ఉక్రెయిన్ రష్యా వార్ నేపథ్యంలో అంతర్జాతియంగా గోల్డ్ ధరలు పెరిగాయి. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్(ఎమ్‌సీఎక్స్‌)లో గోల్డ్ ఫ్యూచర్స్ ధర రూ .52,860 వద్ద ట్రేడవుతోంది. అంతర్జాతీయంగా ధరలు పెరగడంతో దేశీయంగా కూడా ధరలు పెరిగాయి. ముంబైకి చెందిన ఇండియా బులియన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్(ఐబీజెఏ) ప్రకారం.. దేశంలో 24 క్యారెట్ల స్వచ్ఛత గల 10 గ్రాముల బంగారం ధర గత రెండు రోజుల్లో రూ.440కి పైగా పెరిగి ₹54,060కి చేరుకుంది.

భారత్‌లో మానవ హక్కుల ఉల్లంఘన, అమెరికాకు గట్టి కౌంటర్ ఇచ్చిన భారత విదేశాంగశాఖ మంత్రి జైశంకర్‌

ఆభరణాల తయారీలో వాడే 22 క్యారెట్ల బంగారం ధర రూ.49,550కి పెరిగింది. అలాగే, మన హైదరాబాద్ నగరంలో కూడా బంగారం ధరలు భారీగా పెరిగాయి. ఈ రోజు 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.49,010 గా వుంది.. అలాగే, 24 క్యారెట్ల స్వచ్ఛత గల 10 గ్రాముల బంగారం ధర రెండు రోజుల్లో రూ. 53,460 నుంచి రూ. 54,060 కి చేరుకుంది. బంగారం ధరలతో పాటు వెండి ధరలు కూడా భారీగా పెరిగాయి. బంగారం, వెండి ధరలు అనేవి ద్రవ్యోల్బణం, అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు వాటి వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వంటి పలు అంశాలు చేత ప్రభావం చెందుతాయి