Gujarat Fire: గుజరాత్‌లో ఘోర అగ్ని ప్రమాదం, తొమ్మిది మంది సజీవ దహనం, బట్టల గౌడౌన్‌లో ఒక్కసారిగా ఎగిసిన మంటలు, పేలుడు ధాటికి కుప్పకూలిన భవనం ​

గుజరాత్‌లోని ఒక బట్టల గౌడౌన్‌లో ఘోర అగ్నిప్రమాదం (Gujarat Fire) సంభవించింది. అహ్మదాబాద్‌ నానుకాకా ఎస్టేట్‌లోని పిప్లాజ్ రోడ్‌లోని టెక్స్‌టైల్ గోడౌన్‌లో బుధవారం ఒక్కసారిగా భారీ మంటలు (Textile Godown Collapses) వ్యాపించాయి. ఈ కారణంగా భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుడు ధాటికి భవనం ​కుప్పకూలిపోయింది. ఈ ఘటనలో తొమ్మిది మంది సజీవ దహనం అయ్యారు. మరికొందరికి గాయాలు అయ్యాయి.

Fire (Representational image) Photo Credits: Flickr)

Ahmedabad, November 4: గుజరాత్‌లోని ఒక బట్టల గౌడౌన్‌లో ఘోర అగ్నిప్రమాదం (Gujarat Fire) సంభవించింది. అహ్మదాబాద్‌ నానుకాకా ఎస్టేట్‌లోని పిప్లాజ్ రోడ్‌లోని టెక్స్‌టైల్ గోడౌన్‌లో బుధవారం ఒక్కసారిగా భారీ మంటలు (Textile Godown Collapses) వ్యాపించాయి. ఈ కారణంగా భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుడు ధాటికి భవనం ​కుప్పకూలిపోయింది. ఈ ఘటనలో తొమ్మిది మంది సజీవ దహనం అయ్యారు. మరికొందరికి గాయాలు అయ్యాయి.

దీంతో ఆ ప్రాంతమంతా నల్లటి పొగ వ్యాపించడంతో తీవ్ర గందరగోళ పరిస్థితి ఏర్పడింది. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ప్రమాదంలో తొమ్మిది మంది సజీవ దహనం కావడం ఆ కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది.

మంటలు, పేలుడు కారణంగానే భవనం కూలిపోయిందని అగ్నిమాపక అధికారి జయేష్ ఖాడియా తెలిపారు.ఈ ఘటనలో తొమ్మిదిమంది ప్రాణాలు కోల్పోగా, మరికొంతమంది గాయపడ్డారన్నారు. గాయపడిన వారిని శిథిలాల నుండి బయటకు తీసి ఎల్జీ ఆసుపత్రికి తరలించినట్లు చెప్పారు.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement