
Hyderabad, Mar 9: తెలుగు రాష్ట్రాల్లో (Telugu States) మూడు అటవీ ప్రాంతాల్లో అగ్ని ప్రమాదాలు (Fire Accidents) చోటుచేసుకున్నాయి. దీంతో కిలోమీటర్ల మేర పచ్చని అటవీ ప్రాంతం కాలి బూడిదైంది. మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం పెద్దమ్మ తండా సమీపంలో అటవీ ప్రాంతంలో మంటలు చెలరేగాయి. భయాందోళనతో తండా వాసులు ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు మంటలను అదుపు చేయడానికి ప్రయత్నాలు ముమ్మరం చేశారు. అయితే, అగ్ని ప్రమాదానికి ఉద్దేశపూర్వకంగా ఎవరైనా తెగబడ్డారా? లేదా ఎండల తీవ్రత వల్ల ఇలా జరిగిందా? అనే కోణంలో అధికారులు విచారణ చేపడుతున్నారు.
బిర్యానీలో బొద్దింక.. జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో ఘటన (వీడియో)
Here's Video:
అడవిలో అగ్ని ప్రమాదం.. కిలోమీటర్ల మేర చెట్లు దగ్ధం
మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం పెద్దమ్మ తండా సమీపంలో అటవీ ప్రాంతంలో చెలరేగిన మంటలు
భయాందోళనతో ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇచ్చిన తండా వాసులు
ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేస్తున్న అధికారులు pic.twitter.com/foBVoWEnls
— BIG TV Breaking News (@bigtvtelugu) March 9, 2025
ఇక్కడ కూడా దావానలమే
మహబూబ్ నగర్ జిల్లా మహ్మదాబాద్ ఫారెస్టు రేంజ్ అటవీప్రాంతంలోనూ దాదాపు అర కిలో మీటరు మేర మంటలు వ్యాపించి అగ్ని ప్రమాదం చోటు చేసుకున్నది. స్థానికుల కథనం ప్రకారం.. శుక్రవారం ధర్మాపూర్ అటవీ ప్రాంతంలో ప్రమాదవశాత్తు అడవికి నిప్పంటుకుని చుట్టుపక్కల అర కిలో మీటరు వరుకు మంటలు వ్యాపించాయి. ఎండల తీవ్రత వల్ల చెట్లు కాలి బూడిదయ్యాయి. సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు సకాలంలో స్పందించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అటు ఏపీలోని తిరుపతి శేషాచలం అడవుల్లోనూ శనివారం అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. వందల ఎకరాల్లో చెట్లు దగ్దమయ్యాయి. అప్రమత్తమైన అధికారులు మంటలు ఆర్పివేశారు.