HC on PM Modi's Degree: అరవింద్ కేజ్రీవాల్‌కు గుజరాత్ హైకోర్టులో ఎదురుదెబ్బ, ప్రధాని మోదీ డిగ్రీ వివరాల పిటిషన్ కొట్టేసిన న్యాయస్థానం, ఢిల్లీ సీఎంకు రూ. 25 వేలు జరిమానా

ప్రధానమంత్రి నరేంద్రమోదీ విద్యార్హత సర్టిఫికెట్లను తనకు అందించాలన్న చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషన్ (సీఐసీ) ఆదేశాలను కొట్టివేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును సమీక్షించాలని కోరుతూ ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్‌ను గుజరాత్ హైకోర్టు గురువారం కొట్టివేసింది.

Modi and Kejriwal (Photo-ANI)

Gandhi Nagar, Nov 9: ప్రధానమంత్రి నరేంద్రమోదీ విద్యార్హత సర్టిఫికెట్లను తనకు అందించాలన్న చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషన్ (సీఐసీ) ఆదేశాలను కొట్టివేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును సమీక్షించాలని కోరుతూ ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్‌ను గుజరాత్ హైకోర్టు గురువారం కొట్టివేసింది.దాంతో పాటుగా రూ.25,000 జరిమానా విధించింది.జస్టిస్ బీరెన్ వైష్ణవ్‌తో కూడిన ధర్మాసనం కేజ్రీవాల్ రివ్యూ దరఖాస్తును తోసిపుచ్చింది.

కాగా ప్రధాని నరేంద్ర మోదీ అకాడమిక్ డిగ్రీ వివరాలు ఇవ్వాల్సిన బాధ్యత గుజరాత్ యూనివర్సిటీకి లేదంటూ ఈ ఏడాది మార్చి 31న హైకోర్టు తీర్పునిచ్చింది.ఈ తీర్పును సవాలు చేస్తూ కేజ్రీవాల్ మళ్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ విచారించిన కోర్టు.. ఆయన పిటిషన్ ని కొట్టేసింది.ప్రధాని మోదీ విద్యార్హతను తెలిపే ధ్రువపత్రాలు చూపించే అవసరం లేదని తేల్చిచెప్పింది. మార్చిలో ఏడేళ్ల క్రితం సమాచార కమిషన్ ఇచ్చిన ఆదేశాలను కొట్టేసిన న్యాయస్థానం కేజ్రీవాల్ కు రూ.25 వేల జరిమానా కూడా విధించింది.

ఇంకా ఎంతగా దిగజారిపోతారు, బీహార్‌ సీఎం నీతీశ్‌కుమార్‌పై విరుచుకుపడిన ప్రధాని మోదీ, దుమారం రేపుతున్న జనాభా నియంత్రణ వ్యాఖ్యలు

ప్రధాని నరేంద్ర మోదీ విద్యార్హతలపై ఆరోపణలు చేస్తున్న ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్.. ఆయన ఉన్నత విద్య సర్టిఫికేట్ల కోసం 2016లో సమాచార హక్కు చట్టం కింద కేంద్ర సమాచార కమిషన్ కి దరఖాస్తు చేసుకున్నారు. ఈ దరఖాస్తు పరిశీలించిన సీఐసీ.. ప్రధాని మోదీ ధ్రువపత్రాలు చూపించాలని పీఎంవో కార్యాలయ పీఐవో(PIO), గుజరాత్, ఢిల్లీ యూనివర్సిటీల(Delhi University) పీఐవోలను 2016లో ఆదేశించింది.

కొన్నాళ్లకు సీఐసీ(CIC) ఆదేశాలను సవాలు చేస్తూ గుజరాత్ యూనివర్సిటీ.. హైకోర్టును ఆశ్రయించింది. దీంతో సీఐసీ ఆదేశాలపై అప్పుడు హైకోర్టు స్టే విధించింది. అనంతరం విచారించిన కోర్టు ఆ వివరాలు బయటపెట్టే అవసరం లేదని తీర్పునిచ్చింది. తాజాగా కోర్టు తీర్పు సవాలు చేస్తూ కేజ్రీవాల్ మళ్లీ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. విచారించిన కోర్టు ఆయన పిటిషన్‌ని కొట్టేసింది. ప్రధాని మోదీ 1978లో గుజరాత్ వర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్, 1983లో ఢిల్లీ వర్సిటీ నుంచి పీజీ పూర్తి చేశారు.

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

Family Dies By Suicide: హైదరాబాద్ లోని హబ్సిగూడలో పెను విషాదం.. కుమారుడికి విషమిచ్చి, కుమార్తెకు ఉరివేసి దంపతుల ఆత్మహత్య.. ఎందుకంటే?? (వీడియో)

Vallabhaneni Vamsi Case: వల్లభనేని వంశీకి ఊరట, మరోసారి విచారించేందుకు కస్టడీకి ఇవ్వాలంటూ పోలీసులు వేసిన పిటిషన్ కొట్టివేత, బెయిల్ పిటిషన్‌ పై విచారణ 12కి వాయిదా

Ranganath on Pranay Murder Case: కూతురు మీద ప్రేమతో మరో ఇంటి వ్యక్తిని చంపడం కరెక్ట్ కాదు, ప్రణయ్ హత్య కేసుపై స్పందించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్

Chandrababu Launches Shakti Teams: శక్తి టీమ్స్‌ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు... మహిళా దినోత్సవం సందర్భంగా వివిధ కార్యక్రమాలకు శ్రీకారం, ప్రతీ గ్రామంలో అరకు కాఫీ ఔట్ లెట్స్‌ ఉండాలని వెల్లడి

Advertisement
Advertisement
Share Now
Advertisement