Viral News: ముగ్గురు భార్యలతో 60 మంది పిల్లలను కన్నాడు, అయినా తనివి తీరలేదట, నాలుగో పెళ్లికి రెడీ అంటున్నాడు, ఎవరో ఎక్కడో తెలిస్తే షాక్ తింటారు..
క్వెట్టా ప్రావిన్సు వాసి అయిన ఖిల్జీ ఓ సామాన్య బస్సు డ్రైవర్. ముగ్గురు భార్య ముద్దుల మొగుడైన ఖిల్జీకి ఇప్పటికే 59 మంది సంతానం ఉన్నారు.
పాకిస్తాన్‌లోని 50 ఏళ్ల సర్దార్ జాన్ మొహమ్మద్ ఖాన్ ఖిల్జీ ఏకంగా 60 మంది పిల్లల తండ్రిగా మారి ప్రపంచ వ్యాప్తంగా వైరల్ అయ్యాడు. క్వెట్టా ప్రావిన్సు వాసి అయిన ఖిల్జీ ఓ సామాన్య బస్సు డ్రైవర్. ముగ్గురు భార్య ముద్దుల మొగుడైన ఖిల్జీకి ఇప్పటికే 59 మంది సంతానం ఉన్నారు. ఈ మధ్యనే మరో కుమారుడు జన్మించడంతో ఆయన సంతానం ప్రస్తుతం 60 మందికి పెరిగింది. తాజాగా పుట్టిన కుమారుడికి హాజీ ఖుషాహల్ ఖాన్ అని పేరు పెట్టారు. ఇంతమంది పిల్లలున్నా ఖిల్జీకి ఇంకా తృప్తి కలగలేదు. తాజాగా ముగ్గురు భార్యలు సరిపోలేదు అని నాలుగవ పెళ్లి చేసుకోవాలని అతను తహతహలాడిపోతున్నాడు. ఆ వచ్చే భార్య ద్వారా మరింత మంది పిల్లల్ని కనాలన్నదే ఆయన కోరిక అట, భార్య, పిల్లలను తీసుకుని విహార యాత్రకు వెళ్లాలన్నది అతడి చిరకాల కోరిక. అయితే ఇంత మందితో ప్రయాణమంటే అతనికి చాలా కష్టమవుతోందట.
అందుకోసం ప్రభుత్వం తనకో బస్సును కానుకగా ఇవ్వాలని ఖిల్జీ కోరుతున్నాడు. ఉమ్మడి కుటుంబమంటే ప్రాణం పెట్టే ఖిల్జీ తన ముగ్గురు భార్యలు, 60 మంది పిల్లలతో కలిసి ఒకే ఇంట్లో నివసించడం కూడా విశేషమే.