Horoscope Today: నేటి రాశిఫలాలు, కొన్ని రాశుల వారికి ధనలాభంతో పాటు శుభవార్తలు, జాగ్రత్తలు తీసుకోవాల్సిన రాశుల వారు వీరే..

శ్రమతో కూడిన విజయాలు ఉన్నాయి. వివాదాల జోలికి పోకుండా ఉండటం మేలు. పనుల్లో విజయం. ఆప్తుల సలహాలు స్వీకరిస్తారు. సంఘంలో గౌరవం. కొన్ని సమస్యలు తీరతాయి.

(Photo Credits: Flickr)

మేషం: ఆర్థికంగా కలిసొచ్చే కాలం. శ్రమతో కూడిన విజయాలు ఉన్నాయి. వివాదాల జోలికి పోకుండా ఉండటం మేలు. పనుల్లో విజయం. ఆప్తుల సలహాలు స్వీకరిస్తారు. సంఘంలో గౌరవం. కొన్ని సమస్యలు తీరతాయి. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహవంతంగా ఉంటాయి. దుర్గదేవి స్తోత్ర పారాయణ చేయడం మంచిది.

వృషభం: మీ ఆర్థిక స్థితిని మెరుగుపరిచే ప్రయత్నాలు ఉన్నాయి. అన్ని రంగాల వారికి అనుకూల పరిస్థితులు ఉన్నాయి. సన్నిహితుల సాయం అందుతుంది. వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. ఆప్తుల నుండి కీలక సమాచారం. ధనలాభం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ముందడుగు వేస్తారు.

మిథునం: శుభకాలం నడుస్తోంది. వృత్తిపరమైన రంగంలో మీ ప్రతిభను ప్రదర్శించడానికి ఇది అద్భుతమైన రోజు. ఒత్తిడికి గురవుతున్న వారు మానసిక ప్రశాంతత పొందడంలో విజయం సాధిస్తారు.కొన్ని పనులు వాయిదా వేస్తారు. ఆలోచనలు నిలకడగా సాగవు. బంధువులతో తగాదాలు. ఆర్థిక లావాదేవీలు మందగిస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు.

కర్కాటకం: చేపట్టే పనిలో ఆటంకాలు ఉన్నాయి. బంధువుల వ్యవహారాలలో చొరవ తీసుకోవద్దు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. శ్రమాధిక్యం. పనుల్లో తొందరపాటు. దూరప్రయాణాలు. ఆస్తులు కొనుగోలులో అవాంతరాలు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొంత గందరగోళం.

ఈ నాలుగు రాశుల వారికి నేటి నుంచి ధనయోగం ప్రారంభం, పాత అప్పులు తిరిగివస్తాయి, వాహనం కొంటారు, ఆదాయం పెరుగుతుంది, మీ రాశి ఉందో లేదో చెక్ చేసుకోండి..

సింహం: సాహసోపేతమైన నిర్ణయాలు గొప్ప లాభాన్నిస్తాయి. మనోధైర్యం తగ్గకుండా చూసుకోవాలి. దూరప్రాంతాల నుండి శుభవార్తలు. వాహనయోగం. చర్చలు సఫలం. కీలక నిర్ణయాలు. విందువినోదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరింత పురోగతి.

కన్య: భారీగా పెట్టుబడులు పెట్టిన వారికి ఊహించిన దానికంటే అధిక ధన లాభాన్ని పొందుతారు. అభివృద్ధికి సంబంధించిన పనులు చేస్తారుపరిస్థితులు అనుకూలిస్తాయి. సంఘంలో గౌరవం. పలుకుబడి పెరుగుతుంది. ధనలాభం. విందువినోదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి.

తుల: సమతుల్య ఆహారం మరియు వ్యాయామం చేయడం మంచిది. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది.రుణాలు చేస్తారు. ఆర్థిక పరిస్థితి నిరాశ పరుస్తుంది. ఆరోగ్యసమస్యలు. దూరప్రయాణాలు. ఆస్తి వివాదాలు. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు సాధారణంగా కొనసాగుతాయి.

వృశ్చికం: మిశ్రమ కాలం నడుస్తోంది. ఒక వ్యవహారంలో తోటి వారి సహాయం అందుతుంది. కొందరికి ఆస్తి ఒప్పందం నుంచి మంచి రాబడి వచ్చే అవకాశం ఉంది.సన్నిహితుల నుండి ఒత్తిడులు. ఆధ్యాత్మిక చింతన. స్వల్ప అనారోగ్యం. ప్రయాణాలు వాయిదా వేస్తారు. శ్రమ పెరుగుతుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొన్ని చికాకులు.

ధనుస్సు: ముఖ్య కార్యాల్లో ఆలస్యం జరిగే సూచనలు ఉన్నాయి. మీ శ్రమకు తగిన గుర్తింపు వస్తుంది. కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు వింటారు. భూలాభాలు. పనులు చకచకా సాగుతాయి. ధనప్రాప్తి. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో కొత్త హోదాలు రాగలవు.

మకరం: వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో శ్రమకు తగ్గ ఫలితం ఉంటుంది. అధికారులతో జాగ్రత్తగా ఉండాలి. మిత్రులతో కలహాలు. బాధ్యతలు పెరుగుతాయి. ఆకస్మిక ప్రయాణాలు. దైవదర్శనాలు. వ్యాపారాలు నిరాశ పరుస్తాయి. ఉద్యోగాలలో ఇబ్బందులు నెలకొంటాయి.

కుంభం: స్పష్టమైన ఆలోచనలతో ఫలితాలను అందుకుంటారు. తలపెట్టిన పనిలో విజయం దక్కుతుంది. ఊహించిన దానికంటే అధిక ధన లాభాన్ని పొందుతారు.నూతన పరిచయాలు. సమాజంలో గౌరవం. విచిత్ర సంఘటనలు. ముఖ్య నిర్ణయాలు. వస్తులాభాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు తొలగుతాయి.

మీనం: సమాజంలో కీర్తి ప్రతిష్ఠలు పెరుగుతాయి. అభివృద్ధికి సంబందించిన ఓ శుభవార్త వింటారు. పనుల్లో అవాంతరాలు. ఆర్థిక పరిస్థితి అనుకూలించదు. వివాదాలకు దూరంగా ఉండండి. బంధువులతో తగాదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో సమస్యలు ఎదురుకావచ్చు.