Wife Cheats Husband: పెళ్లి అయ్యింది కానీ, శోభనం రాత్రి భార్య చేసిన పనికి భర్తకు కోలుకోలేని షాక్, మరో వ్యక్తితో జంపు జిలానీ, 5 లక్షల క్యాష్, బంగారం కూడా మాయం..అయ్యో పాపం

పెళ్లి కూడా వైభవంగా జరిగింది. జీవితంలో ఇక అన్నీ సంతోషాలే అని అనుకున్నాడు. కానీ ఆ ఆనందం ఎన్నో రోజులు నిలవలేదు.పెళ్లై నెల రోజులు కూడా గడవక ముందే.. ఊహించిన అనుభవం ఎదురయింది.

Marriage| Representational Image (Photo Credits: unsplash)

అందమైన,అమ్మాయి భార్యగా వచ్చిందని ఎంతో సంతోష పడ్డాడు. పెళ్లి కూడా వైభవంగా జరిగింది. జీవితంలో ఇక అన్నీ సంతోషాలే అని అనుకున్నాడు. కానీ ఆ ఆనందం ఎన్నో రోజులు నిలవలేదు.పెళ్లై నెల రోజులు కూడా గడవక ముందే.. ఊహించిన అనుభవం ఎదురయింది. ఆమె షాకింగ్ విషయం చెప్పడంతో అతడు ఖంగుతిన్నాడు. భర్తను వదలిపెట్టి పుట్టింటికి పారిపోయింది. .తనకు ఇది వరకే పెళ్లై, పిల్లలు కూడా ఉన్నారని చెప్పడంతో.. అతడికి గుండె పగిలినంత పనయింది. అసలు ఆమె ఎవరో, ఏంటో తెలుసుకుందాం.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రాజస్థాన్‌లోని బార్మేడ్ జిల్లా భీందాకు చెందిన సురేష్ ( పేరు మార్చాం) పెళ్లి కోసం చాలా రోజులుగా ప్రయత్నిస్తున్నాడు. కానీ సంబంధాలు కుదరలేదు. చివరకు జోగారామ్ అనే పెళ్లిళ్ల బ్రోకర్‌ని కలిసి తన గురించి వివరించాడు. రూ. 3లక్షలు ఖర్చువుతుందని మంచి సంబంధం తీసుకొస్తాని చెప్పాడు. అతడు చెప్పినట్లుగానే మూడు లక్షలు ఇవ్వడంతో జోగారామ్ ఓ సంబంధం తీసుకొచ్చాడు. అమ్మాయి పేరు సమత (పేరు మార్చాం) . గుజరాత్‌లోని అహ్మదాబాద్ ఆమె స్వస్థలం. చాలా అందంగా ఉంటుంది. తనకు కూడా నచ్చడంతో సురేష్ పెళ్లికి ఓకే చెప్పాడు. గత ఏడాది నవంబరు 24న వీరి వివాహం జరిగింది. పెళ్లి జరిగిన అనంతరం 3 రోజు శోభనం జరగాల్సి ఉంది. అదే రోజు ఉదయం బ్యూటీ పార్లర్ కు వెళ్లి వస్తాను అని చెప్పి తిరిగి రాలేదు. దీంతో సురేష్ కంగారు పడ్డాడు. గంటలు, రోజులు గడిచిపోయాయి.

వారం తర్వాత ఆమె ఫోన్ కాల్ అతి కష్టం మీద కలిసింది. ఎక్కడున్నావని అడిగాడు. ''నేను మా అహ్మదాబాద్ కి వచ్చేశాను. నువ్వంటే నాకు ఇష్టం లేదు. నాకు ఇదివరకే పెళ్లయింది. ఒక బిడ్డ కూడా ఉంది' అని సమత చెప్పింది. ఆమె మాటలు విని సురేష్ షాక్ తిన్నాడు. మరి ఎందుకు తనను మోసం చేశానని అడిగితే సమాధానం చెప్పలేదు. మళ్లీ ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయలేదు. ఆ తర్వాత నెంబర్ మార్చేసింది. అంతేకాదు సమత ఇంటి నుంచి వెళ్లిపోయాక.. ఇంట్లో రూ.5 లక్షల నగదు, 50 తులాల వెండి ఆభరణాలు, 2 తులాల బంగారం ఆభరణాలు కూడా కనిపించకుండాపోయాయి. సమతే వాటిని చోరీ చేసిందని సురేష్ కి అర్ధమయింది. ఏం చేయాలో తెలియక.. చివరకు పోలీసులను ఆశ్రయించాడు. తనకు జరిగిన అన్యాయాన్ని వారికి వివరించి.. న్యాయం చేయాలని కోరాడు. ఆయన ఫిర్యాదు మేరకు పోలీసులు సమతతో పాటు పెళ్లిళ్ల బ్రోకర్ , అహ్మదాబాద్‌కు చెందిన మకో వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు.



00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif