Axe (Photo-Pixabay)

Sangareddy, Feb 21: తెలంగాణలో దారుణ ఘటన చోటు చేసుకుంది. తాగిన మైకంలో ఓ భర్త తన భార్యను గొడ్డలితో నరికేసాడు. మత్తు దిగిన తర్వాత లబోదిబోమన్నాడు. సంగారెడ్డి జిల్లా కంగ్టి మండలం తుర్కవడగామ గ్రామంలో బుధవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. స్థానిక పోలీసులు, కంగ్టి ఎస్సై విజయ్‌కుమార్‌ తెలిపిన వివరాల ప్రకారం.. తుర్కవడగామ గ్రామానికి చెందిన చంద్రమ్మ (45) కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తోంది. వీరికి ఇద్దరు కూతుళ్లు, ఇద్దరు కొడుకులు ఉన్నారు.

ఆమె భర్త తాగుడుకు బానిస కావడంతో రోజు ఇద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. బుధవారం అర్ధరాత్రి భర్త గుండప్ప మద్యం సేవించి వచ్చి భార్య చంద్రమ్మతో గొడవ పెట్టుకున్నాడు. ఈ గొడవలో మాటమాట పెరగడంతో ఇంట్లో ఉన్న గొడ్డలితో ( Man axes wife to death ) భార్య చంద్రమ్మను సోయి మరిచి అతికిరాతకంగా నరికి చంపాడు.

వీడియో ఇదిగో, పుల్లుగా మద్యం తాగి నడిరోడ్డు మీద భార్యతో సబ్-ఇన్‌స్పెక్టర్ పాడు పని, వద్దన్నా వినకుండా దగ్గరకు లాక్కుని అసభ్యప్రవర్తన, సస్పెండ్ చేసిన ఉన్నతాధికారులు

తెల్లవారుజామున ఇరుగుపొరుగువారికి ఈ దారున ఘటన గురించి తెలియడంతో వెంటనే సంబంధిత పోలీస్‌స్టేషన్‌కు సమాచారం అందించారు. వెంటనే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని గుండప్పను అదుపులోకి తీసుకున్నారు. చంద్రమ్మ మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం నారాయణఖేడ ఆస్పత్రికు తరిలించారు. గుండప్పపై కేసునమోదు చేసి దర్యాప్తు చేయనున్నట్లు వెల్లడించారు.