 
                                                                 Sangareddy, OCT 12: నారాయణఖేడ్ మండలం సంజీవరావుపేట్‌లో (SanjeevaRao Pet) పలువురు అస్వస్థతకు గురయ్యారు. గ్రామంలోని బావి నీళ్లు తాగిన 50 మంది తీవ్ర అస్వస్థతకు (50 Members Hospitalized) గురయ్యారు. నీళ్లు తాగిన కాసేపటికే వారంతా వాంతులు, విరేచనాలకు గురయ్యారు. బాధితులంతా బీసీ కాలనీకి చెందిన వారు. సమాచారం అందుకున్న అధికారులు అప్రమత్తమై.. అస్వస్థతకు గురైన వారిని చికిత్స నిమిత్తం నారాయణఖేడ్‌లోని (Narayanakhed) ప్రభుత్వ, ప్రయివేటు ఆస్పత్రులకు తరలించారు. అందులో ఇద్దరు మృతి చెందారు.
కొద్దిరోజులుగా గ్రామంలో మిషన్ భగీరథ నీళ్లు రావడం లేదు. దీంతో వారంతా గ్రామంలోని ఓ బావిలోని నీరు తీసుకొచ్చి వాడుకుంటున్నారు. ఈ క్రమంలో బావి నీళ్లు తాగిన వారిలో 50 మంది ఒక్కసారిగా అస్వస్థతకు గురయ్యారు. సమాచారం అందుకున్న వైద్యారోగ్య సిబ్బంది గ్రామంలో క్యాంపు ఏర్పాటు చేశారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిలో పలువురి పరిస్థితి ఇంకా విషమంగానే ఉందని తెలుస్తోంది.
 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                     
                     QuickLY
                                                                                QuickLY
                                     Socially
                                                                                Socially
                                     
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                                                 
                     
                     
                     
                     
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                 
                                
