Corona in India: భారత్‌లో తగ్గుతున్న కరోనా తీవ్రత, తగ్గిన పాజిటివిటీ రేటు, పెరిగిన రికవరీ, కేరళను ఇంకా వీడని కరోనా భయం

భారత్‌లో కరోనా తీవ్రత క్రమంగా అదుపులోకి వస్తున్నట్లే కనిపిస్తోంది. కరోనా యాక్టీవ్ కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతుండగా, రికవరీ రేటు మెరుగవుతోంది. శుక్రవారం దేశవ్యాప్తంగా 12,66,589 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా, 11,850 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది. కిందటి రోజు కంటే 5 శాతం మేర కేసులు తగ్గినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది.

Coronavirus test (Photo-ANI)

New Delhi November 13: భారత్‌లో కరోనా తీవ్రత క్రమంగా అదుపులోకి వస్తున్నట్లే కనిపిస్తోంది. కరోనా యాక్టీవ్ కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతుండగా, రికవరీ రేటు మెరుగవుతోంది. శుక్రవారం దేశవ్యాప్తంగా 12,66,589 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా, 11,850 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది. కిందటి రోజు కంటే 5 శాతం మేర కేసులు తగ్గినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది.

గత ఏడాది ప్రారంభం నుంచి 3.44 కోట్ల మందికి కరోనా సోకింది. వారిలో 3.38 కోట్ల మంది కోలుకున్నారు. నిన్న ఒక్కరోజే 12,403 మంది వైరస్ నుంచి బయటపడ్డారు. గత కొద్దికాలంగా కరోనా వ్యాప్తి కట్టడిలోనే ఉండటంతో కరోనా యాక్టివిటీ రేటు 0.40 శాతానికి చేరింది. ఇక రికవరీ రేటు 98.26 శాతానికి పెరిగింది.

ప్రస్తుతం యాక్టీవ్ కేసుల సంఖ్య 1,36,308గా ఉంది. అవి 274 రోజుల కనిష్ఠానికి తగ్గుముఖం పట్టాయి. ఇక కేరళలో కరోనా మృతుల సంఖ్య పెరుగుతుండటంతో, దేశవ్యాప్తంగా నమోదైన మరణాల సంఖ్యపై ఆ ప్రభావం పడింది. శుక్రవారం దేశవ్యాప్తంగా 555 మంది మరణించారు. ఇప్పటివరకు 4,63,245 మంది కరోనా మహమ్మారికి బలయ్యారు. మరోపక్క నిన్న 58.42 లక్షల మంది వ్యాక్సిన్‌ వేయించుకోగా, మొత్తంగా 111 కోట్లకు పైగా వ్యాక్సిన్‌ డోసులు పంపిణీ అయ్యాయి.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement