COVID in India: గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 20,550 పాజిటివ్ కేసులు నమోదు, భారత్‌లో 1,02,44,853కి చేరిన కొవిడ్ కేసుల సంఖ్య, దేశంలో మరో 14 మందికి కొత్త వేరియంట్ వైరస్ నిర్ధారణ

ఆరోగ్యశాఖ వెల్లడించిన వివరాల ప్రకారం దేశంలో కొవిడ్ రికవరీ రేటు 95.99% ఉండగా, ప్రస్తుతం తీవ్రత (యాక్టివ్ కేసులు) 2.56% శాతంగా ఉన్నాయి, ఇక భారత్ లో కొవిడ్ మరణాల రేటు కేవలం 1.45% గా ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ పేర్కొంది....

Coronavirus Cases in India (Photo Credits: PTI)

New Delhi, December 30: దేశంలో ఒకవైపు ప్రతిరోజు కొత్తగా నమోదయ్యే కొవిడ్ కేసులు ఉండనే ఉంటున్నాయి, దీనికి తోడు ఇప్పుడు కొత్త వేరియంట్ కరోనా కేసులు బయటపడుతున్నాయి. రోజురోజుకి వీరి సంఖ్య కూడా పెరగడం గమనార్హం. అధికారిక గణాంకాల ప్రకారం యునైటెడ్ కింగ్‌డమ్ నుండి భారతదేశానికి తిరిగి వచ్చిన వారిలో మరో 14 మందికి కొత్త వేరియంట్ వైరస్ సోకినట్లు నిర్ధారణ అయింది. దీంతో వీరి సంఖ్య 20 మందికి చేరింది.  

మరోవైపు  గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా మరో 20,550 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తాజా కేసులతో దేశంలో మొత్తం COVID-19 పాజిటివ్ కేసుల సంఖ్య బుధవారం ఉదయం నాటికి 1,02,44,853కు చేరింది. నిన్న ఒక్కరోజే 286 కొవిడ్ మరణాలు నమోదయ్యాయి, దీంతో ఈ వైరస్ కారణంగా దేశంలో ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 1,48,439కు పెరిగింది.

అలాగే,  గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 26,572 కరోనా బాధితులు కోలుకొని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటివరకు 9,83,4141 మంది బాధితులు కోలుకొని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు.  ప్రస్తుతం దేశంలో 2,62,272 ఆక్టివ్ కేసులు ఉన్నాయి. ఈ మేరకు కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది.

India's COVID19 Update:

ఆరోగ్యశాఖ వెల్లడించిన వివరాల ప్రకారం దేశంలో కొవిడ్ రికవరీ రేటు 95.99% ఉండగా, ప్రస్తుతం తీవ్రత  (యాక్టివ్ కేసులు) 2.56%  శాతంగా ఉన్నాయి, ఇక భారత్ లో కొవిడ్ మరణాల రేటు కేవలం 1.45% గా ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ పేర్కొంది.

ఇక డిసెంబర్ 29 వరకు దేశవ్యాప్తంగా 17,09,22,030 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించినట్లు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసిఎంఆర్) వెల్లడించింది. నిన్న ఒక్కరోజే 11,20,281 శాంపుల్స్ పరీక్షించినట్లు పేర్కొంది.

ఇదిలా ఉంటే గ్లోబల్ కరోనావైరస్ కేసుల సంఖ్య 81.9 మిలియన్ల మార్కును దాటేసింది, మరణాలు 1.78 మిలియన్లకు పైగా పెరిగాయని జాన్స్ హాప్కిన్స్ విశ్వవిద్యాలయం తెలిపింది.

బుధవారం ఉదయం నాటికి, ప్రపంచవ్యాప్తంగా మొత్తం కరోనా కేసుల సంఖ్య 81,960,614గా ఉండగా, మరణాలు 1,788,731కు పెరిగాయని యూనివర్శిటీ సెంటర్ ఫర్ సిస్టమ్స్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ (సిఎస్ఎస్ఇ) తన తాజా నవీకరణలో వెల్లడించింది.

Share Now
Advertisement


Advertisement
Share Now
Advertisement