COVID-19 in India: కరోనా కేసులు తగ్గుతున్నా వణికిస్తున్న మరణాలు, తాజాగా 4,147 మంది మృతి, కొత్తగా 2,08,921 మందికి కోవిడ్, గత 24 గంటల్లో 2,95,955 మంది డిశ్చార్జ్, పుదుచ్చేరిలో లక్షకు చేరువైన కరోనా కేసులు

దేశంలో గత 24 గంటల్లో మళ్లీ 2లక్షలకుపైగా కొత్త కేసులు (COVID-19 in India) నమోదయ్యాయి. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ బుధవారం విడుదల చేసిన గణాంకాల ప్రకారం గత 24 గంటల్లో భారత్‌లో 2,08,921 కొత్త కరోనా పాజిటివ్‌ కేసులు (Coronavirus in India) నమోదయ్యాయి. దీంతో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 2,71,57,795కు పెరిగింది.

Coronavirus Outbreak (Photo credits: IANS)

New Delhi, May 26: దేశంలో గత 24 గంటల్లో మళ్లీ 2లక్షలకుపైగా కొత్త కేసులు (COVID-19 in India) నమోదయ్యాయి. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ బుధవారం విడుదల చేసిన గణాంకాల ప్రకారం గత 24 గంటల్లో భారత్‌లో 2,08,921 కొత్త కరోనా పాజిటివ్‌ కేసులు (Coronavirus in India) నమోదయ్యాయి. దీంతో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 2,71,57,795కు పెరిగింది. ఇక గత 24 గంటల్లో 4,147 మంది కోవిడ్‌తో ప్రాణాలు కోల్పోయారు. కొత్త మరణాలతో కలుపుకుని మొత్తం కోవిడ్‌ బాధితుల మరణాల సంఖ్య 3,11,388 కు పెరిగింది. మరణాల రేటు 1.14 శాతంగా నమోదైంది. మరోవైపు, దేశంలో పాజిటివిటీ రేటు 9.60 శాతంగా ఉంది.

గత 24 గంటల్లో 2,95,955 మంది కోవిడ్‌ నుంచి కోలుకున్నారు. దీంతో దేశంలో మొత్తం రికవరీల సంఖ్య 2,43,50,816కు చేరుకుంది. రికవరీ రేటు 89.26 శాతానికి పెరిగింది. అదే సమయంలో దేశంలో మొత్తం యాక్టివ్‌ కేసుల సంఖ్య 24,95,591కు చేరింది. ఇక గడచిన 24 గంటలలో దేశ వ్యాప్తంగా కరోనా వాక్సిన్ తీసుకున్న వారి సంఖ్య 20,39,087 మంది కాగా.. రికార్డ్ స్థాయిలో 22,17,320 మందికి కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించినట్టు ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. దేశంలో అత్య‌ధిక కరోనా కేసులు మహారాష్ట్ర, కర్ణాటకలో న‌మోద‌వుతున్నాయి.

మరి కొద్ది గంటలే..బాలాసోర్‌ దగ్గర తీరం దాటనున్న యాస్ తుఫాన్, తీరం దాటే సమయంలో గంటకు 130-155 కిలోమీటర్ల వేగంతో గాలులు, అప్రమత్తమైన ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలు, ఏపీ రేవుల్లో రెండో ప్రమాద హెచ్చరిక

కేంద్రపాలిత రాష్ట్రం పుదుచ్చేరిలో కరోనా బాధితుల సంఖ్య లక్షకు చేరువైంది. ఈ మేరకు ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి అరుణ్‌ మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో, గడచిన 24 గంటల్లో రాష్ట్రంలో 9,148 కరోనా పరీక్షలు నిర్వహించగా, పుదుచ్చేరిలో 915 మంది, కారైకాల్‌లో 222, యానాంలో 75, మాహేలో 25 మంది అని మొత్తం 1,237 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని తెలిపారు. అదే సమయంలో, పుదుచ్చేరిలో 23 మంది, కారైకాల్‌లో ముగ్గురు... మొత్తం 26 మంది మృతిచెందారని తెలిపారు.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement