COVID19 in India: భారత్లో 17 లక్షలకు చేరువైన కొవిడ్ బాధితుల సంఖ్య, గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా అత్యధికంగా 57,117 కేసులు నమోదు, 36 వేలు దాటిన కరోనా మరణాలు
నిన్న ఒక్కరోజే 764 కోవిడ్ మరణాలు నమోదయ్యాయి, దీంతో ఈ వైరస్ కారణంగా దేశంలో ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 36,511 కు పెరిగింది....
New Delhi, August 1: భారతదేశంలో ప్రతిరోజు రికార్డు స్థాయిలో కొవిడ్19 కేసులు నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా మరో 57,117 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తాజా కేసులతో దేశంలో మొత్తం COVID-19 పాజిటివ్ కేసుల సంఖ్య శనివారం ఉదయం నాటికి 16,95,988 కు చేరింది. నిన్న ఒక్కరోజే 764 కోవిడ్ మరణాలు నమోదయ్యాయి, దీంతో ఈ వైరస్ కారణంగా దేశంలో ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 36,511 కు పెరిగింది.
మరోవైపు గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా రికార్డు స్థాయిలో 36,568 కరోనా బాధితులు కోలుకొని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటివరకు 1,094,374 మంది బాధితులు కోలుకొని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ కాగా, ప్రస్తుతం దేశంలో 565,101 ఆక్టివ్ కేసులు ఉన్నాయని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది.
India's COVID19 Update:
రాష్ట్రాల వారీగా యాక్టివ్ కరోనా కేసుల వివరాలు ఇలా ఉన్నాయి:
S. No. | Name of State / UT | Active Cases* | Cured/Discharged/Migrated* | Deaths** | |||
---|---|---|---|---|---|---|---|
Total | Change since yesterday | Cumulative | Change since yesterday | Cumulative | Change since yesterday | ||
1 | Andaman and Nicobar Islands | 329 | 63 | 214 | 13 | 5 | 1 |
2 | Andhra Pradesh | 75720 | 6468 | 63864 | 3840 | 1349 | 68 |
3 | Arunachal Pradesh | 670 | 16 | 918 | 91 | 3 | |
4 | Assam | 9814 | 581 | 30357 | 1277 | 98 | 4 |
5 | Bihar | 17579 | 734 | 33358 | 2008 | 296 | 14 |
6 | Chandigarh | 369 | 14 | 667 | 20 | 15 | 1 |
7 | Chhattisgarh | 2803 | 14 | 6230 | 309 | 53 | 2 |
8 | Dadra and Nagar Haveli and Daman and Diu | 412 | 18 | 686 | 18 | 2 | |
9 | Delhi | 10705 | 38 | 120930 | 1206 | 3963 | 27 |
10 | Goa | 1657 | 4211 | 206 | 45 | 3 | |
11 | Gujarat | 14090 | 297 | 44907 | 833 | 2441 | 23 |
12 | Haryana | 6317 | 180 | 28227 | 887 | 421 | 4 |
13 | Himachal Pradesh | 1091 | 14 | 1459 | 72 | 14 | |
14 | Jammu and Kashmir | 7765 | 103 | 12217 | 375 | 377 | 12 |
15 | Jharkhand | 6538 | 650 | 4314 | 138 | 106 | 3 |
16 | Karnataka | 72013 | 2305 | 49788 | 3094 | 2314 | 84 |
17 | Kerala | 10517 | 443 | 13023 | 864 | 73 | 3 |
18 | Ladakh | 302 | 25 | 1095 | 1 | 7 | |
19 | Madhya Pradesh | 8668 | 214 | 22271 | 614 | 867 | 10 |
20 | Maharashtra | 150966 | 2512 | 256158 | 7543 | 14994 | 265 |
21 | Manipur | 927 | 98 | 1689 | 17 | 5 | 1 |
22 | Meghalaya | 603 | 15 | 215 | 5 | 5 | |
23 | Mizoram | 165 | 9 | 247 | 13 | 0 | |
24 | Nagaland | 1053 | 117 | 635 | 10 | 5 | |
25 | Odisha | 11182 | 719 | 20518 | 772 | 177 | 8 |
26 | Puducherry | 1323 | 31 | 2100 | 142 | 49 | 1 |
27 | Punjab | 4999 | 422 | 10734 | 225 | 386 | 16 |
28 | Rajasthan | 11589 | 492 | 29035 | 650 | 674 | 11 |
29 | Sikkim | 407 | 12 | 231 | 17 | 1 | |
30 | Tamil Nadu | 57968 | 6 | 183956 | 5778 | 3935 | 97 |
31 | Telengana | 16796 | 1156 | 45388 | 816 | 519 | 14 |
32 | Tripura | 1630 | 93 | 3327 | 365 | 21 | |
33 | Uttarakhand | 2935 | 58 | 4168 | 172 | 80 | 4 |
34 | Uttar Pradesh | 34968 | 2319 | 48863 | 2060 | 1630 | 43 |
35 | West Bengal | 20233 | 333 | 48374 | 2118 | 1581 | 45 |
Total# | 565103 | 19785 | 1094374 | 36569 | 36511 | 764 | |
*(Including foreign Nationals) | |||||||
**( more than 70% cases due to comorbidities ) |
మహారాష్ట్రలో ఒకరోజులో వచ్చే పాజిటివ్ కేసుల సంఖ్య ఇటీవల కాలంగా మిగతా కొన్ని రాష్ట్రాల కంటే తక్కువగానే నమోదవుతున్నప్పటికీ, కొవిడ్ తీవ్రత మాత్రం ఇప్పటికీ ఎక్కువగానే కనిపిస్తోంది. నిన్న కొత్తగా మరో 7543 పాజిటివ్ కేసులు, 263 కరోనా మరణాలు నమోదయ్యాయి.
దీంతో ఈ రాష్ట్రంలో మొత్తం కొవిడ్ బాధితుల సంఖ్య 4,22,118 కు చేరింది. మహారాష్ట్ర తర్వాత తమిళనాడు అత్యధికంగా 2,45,859 పాజిటివ్ కేసులు 3,935 మరణాలతో రెండో స్థానంలోనూ, 1,40,933 పాజిటివ్ కేసులతో ఆంధ్రప్రదేశ్ 3వ స్థానంలో కొనసాగుతున్నాయి.
కరోనావైరస్ టెస్టుల విషయానికి వస్తే, గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా రికార్డ్ స్థాయిలో 5,25,689 శాంపుల్స్ పరీక్షించినట్లు ఐసీఎంఆర్ పేర్కొంది. జూలై 31 వరకు మొత్తంగా 1,93,58,659 టెస్టులు నిర్వహించినట్లు వెల్లడించింది.