Jamia Violence: పోలీసులపై రాళ్లు రువ్వుతూ లైబ్రరీలోకి దూసుకెళ్లారు, జామియా వార్ తాజా వీడియో వెలుగులోకి, యూనివర్సిటీ యాజమాన్యం అనుమతి లేకుండా లోపలికి ఎవరూ వెళ్లలేరన్న పోలీస్ అధికారి రంధ్వా
సీఏఏకు వ్యతిరేకంగా జామీయా యూనివర్సిటీలో (Jamia Millia Islamia (JMI)) జరిగిన ఆందోళనల్లో హింసాత్మక ఘటన చోటు చేసుకున్న సంగతి విదితమే. డిసెంబర్ 15న జరిగిన ఈ హింసాత్మక ఘటనలపై తాజాగా విడుదలైన వీడియో మరికొన్ని సంచలన విషయాలను వెలుగులోకి తెచ్చింది.
New Delhi, Febuary 22: సీఏఏకు వ్యతిరేకంగా జామీయా యూనివర్సిటీలో (Jamia Millia Islamia (JMI)) జరిగిన ఆందోళనల్లో హింసాత్మక ఘటన చోటు చేసుకున్న సంగతి విదితమే. డిసెంబర్ 15న జరిగిన ఈ హింసాత్మక ఘటనలపై తాజాగా విడుదలైన వీడియో మరికొన్ని సంచలన విషయాలను వెలుగులోకి తెచ్చింది.
పోలీసులపై రాళ్లు రువ్వుతున్న ఆందోళనకారులు నేరుగా యూనివర్సిటీలోకి వెళ్లినట్లు వీడియోలో తెలుస్తోంది. రాళ్ల దాడి చేస్తూ లైబ్రరీ వద్దకు చేరుకున్నట్లు ఆ సీసీ కెమెరా వీడియోలు (CCTV footage) వెల్లడిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు బాష్పావాయుగోళాలను ప్రయోగించినట్లుగా తెలుస్తోంది.
యూనివర్సిటీ వర్సిటీలోని( Jamia University) ఓ భవనం వద్ద, భవనం లోపల భారీ సంఖ్యలో ఉన్న విద్యార్థులు, ఆందోళనకారులు బయటికి పరుగులు తీసుకుంటూ వచ్చారు. ముసుగులు ధరించిన వారు లైబ్రరీలోకి పారిపోయారు. అయితే, లైబ్రరీలోకి వచ్చిన పోలీసులు అక్కడ ఉన్న విద్యార్థులను ఇష్టానుసారంగా కొట్టారని ఫిర్యాదు చేసిన విషయం విదితమే. దీనికి సంబంధించి ఓ వీడియో కూడా బయటకు విడుదలయింది.
Here's Video
తాజాగా దీనికి సంబంధించి పోలీసులు ఓ వీడియోను విడుదల చేశారు. ఈ వీడియోలో ఆందోళనకారులే ఆ లైబ్రరీలోకి వెళ్లినట్లు తెలుస్తోంది. రాళ్లు రువ్వినవారిని తరుముకుంటూ పోలీసులు వెళ్లారని అధికారులు చెబుతున్నారు. అయితే, లైబ్రరీలోకి వెళ్లలేదని చెప్పారు. యూనివర్సిటీ యాజమాన్యం అనుమతి లేకుండా పోలీసులు ఏ యూనివర్సిటీలోకి వెళ్లలేరని సీనియర్ పోలీస్ అధికారి ఎంఎస్ రంధ్వా తెలిపారు.
జామియా మిలియా అల్లర్లలో బయట వ్యక్తుల పాత్ర
కాగా, ఆ రోజున ఆందోళనకారులు మూడు బస్సులకు నిప్పుపెట్టారు. మరో రెండు ద్విచక్ర వాహనాలను తగలబెట్టారు. ఈ ఆందోళనల నేపథ్యంలో పదిమంది వర్సిటీ విద్యార్థులకు పోలీసులు ఇప్పటికే నోటీసులు జారీ చేశారు.