New Delhi, December 17: దిల్లీలో జామియా మిలియా ఇస్లామియా వర్శిటీ విద్యార్థుల నిరసన (Jamia Millia Islamia Protests) సందర్భంగా డిసెంబర్ 15న చెలరేగిన హింసాత్మక ఘర్షణలకు సంబంధించి క్రిమినల్ నేపథ్యం (criminal background)ఉన్న పది మందిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. వర్శిటీకి సంబంధంలేని కొంత మంది బయట వ్యక్తుల పాత్ర ఇందులో ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. తాము అరెస్ట్ చేసిన వారిలో విద్యార్థులు ఎవరూ లేరని పోలీసులు స్పష్టం చేశారు.
పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ ఆదివారం రోజు జామియా విద్యార్థులు, స్థానికులు కలిసి చేపట్టిన (Anti-CAA Protests) నిరసనలు వక్రమార్గంలో వెళ్లాయి. దక్షిణ దిల్లీలోని కొన్ని ప్రాంతాల్లో బస్సులు మరియు ఇతర వాహనాలకు అల్లరిమూకలు నిప్పంటించారు. ఆ తర్వాత పోలీసులతో ఘర్షణకు దిగారు, రాళ్లు విసిరారు.
ఉద్రిక్త పరిస్థితులను అదుపు చేసే క్రమంలో పోలీసులు టియర్ గ్యాస్ షెల్స్ ఉపయోగించారు. క్యాంపస్ లోకి ప్రవేశించి లాఠీఛార్జ్ చేశారు. ఈ ఘటనలో కొంత మంది విద్యార్థులకు గాయాలయ్యాయి. వర్శిటీలో టెన్షన్ వాతావరణం నెలకొనడంతో చాలా మంది విద్యార్థులు క్యాంపస్ ను వదిలి సొంత ఇళ్లకు వెళ్లిపోయారు.
Check ANI Update:
Delhi Police: 10 people with criminal backgrounds arrested, in connection with Dec 15 Jamia Millia Islamia incident. No student has been arrested. pic.twitter.com/8ympdPOU5r
— ANI (@ANI) December 17, 2019
కాగా, క్యాంపస్ లోకి పోలీసులు ప్రవేశించి విద్యార్థులపై విచక్షణారహితంగా లాఠీఛార్జి చేయడం పట్ల దేశవ్యాప్తంగా అన్ని యూనివర్శిటీల్లో పోలీసుల చర్యకు నిరసనగా పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టారు. వీరికి రాజకీయ, ప్రజా సంఘాల నుంచి మద్ధతు లభించింది. హింసాత్మక ఘటనలపై సుప్రీంకోర్ట్ సీరియస్, 'అల్లర్లు' ఆగితేనే ఘటనపై విచారణ జరుపుతామన్న ధర్మాసనం
ఇక పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా పలు చోట్ల నిరసనలు కొనసాగుతున్నాయి. CAA మరియు దేశవ్యాప్త NRC లపై బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మౌనం వహించడం పట్ల ఆ రాష్ట్రంలోని కొన్ని వర్గాల ప్రజలు 'మా ముఖ్యమంత్రి కనిపించడం లేదు' అంటూ పోస్టర్లు అతికించారు.