IPL Auction 2025 Live

J&K Shocker: పెళ్లికి ఒప్పుకోలేదని చంపి ముక్కలుగా నరికిన కిరాతకుడు, ఒక్కో చోట ఒక్కో శరీర భాగాన్ని పాతిపెట్టి పరారీ, జమ్మూకశ్మీర్‌లో ఉద్రిక్తతలకు దారితీసిన యువతి హత్య

బుద్గామ్‌ (Budgam) జిల్లాలో ఓ వ్యక్తి మహిళను అతి కిరాతకంగా హత్య చేశాడు. ఢిల్లీ శ్రద్ధా వాకర్‌ హత్య ఘటన తరహాలో హత్య అనంతరం బాధితురాలి శరీరాన్నిముక్కలుగా చేసి వేర్వేరు ప్రాంతాల్లో (chops body into pieces) పూడ్చిపెట్టాడు.

Representational Purpose Only (File Image)

Srinagar, March 12: జమ్మూకశ్మీర్‌ (Jammu kashmir)లో దారుణం చోటుచేసుకుంది. బుద్గామ్‌ (Budgam) జిల్లాలో ఓ వ్యక్తి మహిళను అతి కిరాతకంగా హత్య చేశాడు. ఢిల్లీ శ్రద్ధా వాకర్‌ హత్య ఘటన తరహాలో హత్య అనంతరం బాధితురాలి శరీరాన్నిముక్కలుగా చేసి వేర్వేరు ప్రాంతాల్లో (chops body into pieces) పూడ్చిపెట్టాడు. దీంతో నిందితున్ని ఉరి తీయాలని బాధితురాలి తరపు బంధువులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు.  పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మార్చి 7 తేదీన సోయ్‌బగ్‌ (Soibug) గ్రామానికి చెందిన 30 ఏళ్ల మహిళ మార్చి 7న కోచింగ్‌ క్లాసుల కోసం ఇంటి నుంచి వెళ్లింది. రాత్రి వరకు ఆమె తిరిగి రాకపోవడంతో మార్చి 8న ఆమె సోదరుడు తన్వీర్‌ అహ్మద్‌ ఖాన్ స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. తన సోదరి కనిపించకుండా పోవడానికి అదే గ్రామానికి చెందిన షాబిర్‌ అహ్మద్‌ వానీ అనే వ్యక్తిపై అనుమానం ఉన్నట్లు పోలీసులకు తెలిపాడు. దీంతో షాబిర్‌ను (Shabeer) అదుపులోకి తీసుకున్న పోలీసులు తమదైన శైలిలో విచారించడంతో మహిళను తానే హత్య చేసినట్లు అంగీకరించాడు.

Satish Kaushik Death: రూ. 15 కోట్ల కోసమే బాలీవుడ్ నటుడు సతీష్ కౌశిక్ హత్య జరిగిందా? తన భర్తే హత్య చేయించాడంటూ ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేసిన మహిళ, దర్యాప్తు వేగవంతం చేసిన పోలీసులు

మహిళను నిందితుడు హత్య చేయడానికి గల కారణాలను మాత్రం పోలీసులు వెల్లడించలేదు.  నిందితుడు గతంలో ఆమెను వివాహం చేసుకునేందుకు పలుమార్లు సంప్రదించగా.. అందుకు ఆమె నిరాకరించడంతో హత్య చేశాడని బాధితురాలి సోదరుడు ఆరోపించాడు. హత్య అనంతరం ఆధారాలు దొరకుండా ఉండేందుకు ఆమె శరీరాన్ని ముక్కలుగా చేసి వివిధ ప్రాంతాల్లో పూడ్చి పెట్టినట్లు నిందితుడు విచారణలో వెల్లడించాడు. ప్రస్తుతం శరీర భాగాల్ని స్వాధీనపరుచుకుని, వైద్య పరీక్షల కోసం పంపినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. బాధితురాలు, కొద్ది రోజుల క్రితం కంప్యూటర్‌ కోర్సులో చేరిందని, ఆమెకు ఆగస్టులో వివాహం జరగాల్సి ఉండగా, ఇంతలో దారుణం జరిగిందని ఆమె సోదరుడు వాపోయాడు. నిందితుణ్నికఠినంగా శిక్షిచాలని బాధితురాలి తరపు బంధువులు రోడ్లపై పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు.