Kangana Ranaut Apologises: రైతులను క్షమాపణ కోరిన బీజేపీ ఎంపీ కంగనా రనౌత్, వివాదాస్పద రైతు చట్టాలపై చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకుంటున్నట్లు వెల్లడి
రైతుల మీద తన దురుసు వ్యాఖ్యలతో నోరు పారేసుకున్న బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ రైతులకు క్షమాపణ చెప్పారు. 2021లో కేంద్రం రద్దు చేసిన మూడు రైతు చట్టాలను తిరిగి తేవాలంటూ ఆమె ఇటీవల వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు
New Delhi, Sep 26: . వివాదాస్పద రైతు చట్టాలపై తాను చేసిన వ్యాఖ్యలు చాలామందిని అసంతృప్తి, బాధకు గురి చేశాయని, దీనికి తనను క్షమించాలని ఆమె కోరారు. ‘కొద్ది రోజుల క్రితం రైతు చట్టాలపై మీడియా నన్ను కొన్ని ప్రశ్నలు వేసింది. గతంలో రద్దు చేసిన మూడు రైతు చట్టాలను తిరిగి తేవాలని నేను ప్రధాని మోదీని కోరుతానని చెప్పా.
అయితే నేను చేసిన ఈ ప్రకటన చాలామందిని బాధించింది. నేను నా ప్రకటనను వెనక్కి తీసుకుంటూ క్షమాపణలు చెబతున్నా. నేనొక బీజేపీ కార్యకర్తను. నేను చేసే ప్రకటనలు పార్టీ అభిప్రాయాన్ని ప్రతిబింబించేవిగా ఉండాలి తప్ప, వ్యక్తిగతంగా ఉండకూడదు’ అని ఆమె ఒక వీడియో సందేశాన్ని విడుదల చేశారు. కాగా, కంగనా చేసిన వ్యాఖ్యలు ఆమె వ్యక్తిగతమైనవని, వాటికి పార్టీతో సంబంధం లేదని బీజేపీ అధికార ప్రతినిధి గౌరవ్ భాటియా అంతకుముందు ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
Tags
Advertisement
సంబంధిత వార్తలు
Dangerous Stunt On Moving Train: కదులుతున్న రైలు కిటికి పట్టుకుని వేలాడుతూ యువకుడి ప్రమాదకర స్టంట్.. తర్వాత ఏం జరిగింది? (వీడియో)
Ranganath on Pranay Murder Case: కూతురు మీద ప్రేమతో మరో ఇంటి వ్యక్తిని చంపడం కరెక్ట్ కాదు, ప్రణయ్ హత్య కేసుపై స్పందించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్
Police Opposed Cricket Fans: క్రికెట్ ఫ్యాన్స్ పై పోలీసుల గుర్రు.. హైదరాబాద్ లోనే కాదు కరీంనగర్ లో కూడా.. పూర్తి వివరాలు ఇవిగో..!
AP Artist Celebrates Team India Victory: టీమిండియా విజయాన్ని ఆస్వాదిస్తున్న ఏపీ కళాకారుడు.. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీల అద్భుతమైన పెయింటింగ్ తో నీరాజనాలు
Advertisement
Advertisement
Advertisement