Karnataka: రూ. 500 నోట్ల కట్టను గాల్లోకి విసిరిన కర్ణాటక కాంగ్రెస్ చీఫ్, అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల వేళ వివాదంలో డీకే శివకుమార్

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల కోసం రాజకీయ పార్టీలు ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. ఇప్పటికే కాంగ్రెస్ నుంచి అభ్యర్ధులను కూడా ప్రకటించారు. బీజేపీ అవినీతిని టార్గెట్ చేస్తూ కాంగ్రెస్ ప్రచారం ముమ్మరంగా సాగుతోంది. అయితే ఈ సమయంలో కర్ణాటక కాంగ్రెస్ చీఫ్ డీకే శివకుమార్ (DK Shivakumar) వివాదంలో చిక్కుకున్నారు. మాండ్య జిల్లాలో పర్యటించిన ఆయన...అక్కడ కొందరు కళాకారులపై రూ. 500 నోట్లను విసిరారు

DK Shivakumar throwing Rs 500 currency notes (PIC @ ANI Twitter)

Mandya, Macrh 29: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల కోసం రాజకీయ పార్టీలు ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. ఇప్పటికే కాంగ్రెస్ నుంచి అభ్యర్ధులను కూడా ప్రకటించారు. బీజేపీ అవినీతిని టార్గెట్ చేస్తూ కాంగ్రెస్ ప్రచారం ముమ్మరంగా సాగుతోంది. అయితే ఈ సమయంలో కర్ణాటక కాంగ్రెస్ చీఫ్ డీకే శివకుమార్ (DK Shivakumar) వివాదంలో చిక్కుకున్నారు. మాండ్య జిల్లాలో పర్యటించిన ఆయన...అక్కడ కొందరు కళాకారులపై రూ. 500 నోట్లను విసిరారు (throwing Rs 500 currency notes). దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. బహిరంగంగానే ఇలా నోట్లు చల్లడంపై అధికార బీజేపీ విమర్శలు చేస్తోంది. ఈ వీడియోను తమ గ్రూపుల్లో పోస్టు చేస్తోంది.

మాండ్యా జిల్లాలో ప్రజాధ్వని యాత్ర (Praja Dhwani Yatra) నిర్వహిస్తున్న డీకే శివకుమార్..ప్రచార రథంతో రోడ్‌ షో చేపట్టారు. ఈ క్రమంలో బెవినహల్లిలో కొందరు స్థానిక నేతల ఆయనకు గ్రాండ్ వెల్‌కమ్ చెప్పారు. ఇందులో భాగంగా కొన్ని సాంస్కృతిక కార్యక్రమాలు చేపట్టారు. అందులో పాల్గొన్న కళాకారులపై డీకే శివకుమార్ రూ. 500 నోట్లను విసరడం ఇప్పుడు వివాదంగా మారింది. అయితే కాంగ్రెస్ మాత్రం దీనిపై స్పందించలేదు. కర్ణాటక అసెంబ్లీ షెడ్యూల్ విడుదలకు ముందు ఇలా రాజకీయ దుమారం రేగడంతో రాజకీయాలు మరింత హీటెక్కాయి.

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

MLC Candidates: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ టికెట్ దాసోజు శ్రవణ్ కు.. కాంగ్రెస్ అభ్యర్ధులుగా అద్దంకి దయాకర్, విజయశాంతి, శంకర్ నాయక్.. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు నేడు నామినేషన్ల దాఖలుకు చివరి రోజు

TDP Announced MLC Candidates: ఈ సారి వర్మకు నో ఛాన్స్, ముగ్గురు ఎమ్మెల్సీ అభ్యర్ధులను ప్రకటించిన టీడీపీ, రేపటితో ముగియనున్న నామినేషన్ల గడువు

Congress MLC Candidates: మరోసారి చట్టసభల్లోకి రాములమ్మ, ఎట్టకేలకు అద్దంకి దయాకర్‌కు ఎమ్మెల్సీ సీటు, ముగ్గురు అభ్యర్ధుల్ని ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ

Karnataka: రష్మిక మందన్నకు రక్షణ కల్పించాలి.. కాంగ్రెస్ ఎమ్మెల్యే రవి కుమార్ గౌడ వివాదాస్పద నేపథ్యంలో రష్మికకు మద్దతుగా కొడవ సమాజం

Advertisement
Advertisement
Share Now
Advertisement