Karnataka Shocker: కర్ణాటకలో దారుణం, అర్థరాత్రి మాస్క్ ధరించి తల్లితో సహా ముగ్గురు పిల్లలను కత్తితో పొడిచి చంపేసిన అగంతకుడు

కర్ణాటకలోని ఉడిపి జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. మహిళ, ఆమె ముగ్గురు పిల్లలను గుర్తు తెలియని వ్యక్తి కత్తితో పొడిచి చంపాడు. (Stabbed To Death) ఆగంతకుడి కత్తి దాడిలో మరో మహిళ కూడా తీవ్రంగా గాయపడింది.

Knife Representational Image (Photo Credit: Pixabay)

కర్ణాటకలోని ఉడిపి జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. మహిళ, ఆమె ముగ్గురు పిల్లలను గుర్తు తెలియని వ్యక్తి కత్తితో పొడిచి చంపాడు. (Stabbed To Death) ఆగంతకుడి కత్తి దాడిలో మరో మహిళ కూడా తీవ్రంగా గాయపడింది. ఆదివారం తెల్లవారుజామున కెమ్మన్ను ప్రాంతంలోని ఒక ఇంట్లోకి మాస్క్‌ ధరించిన వ్యక్తి చొరబడ్డాడు. ఇంట్లో నిద్రిస్తున్న ఇద్దరు మహిళలు, ముగ్గురు పిల్లలపై కత్తితో దాడి చేశాడు. కత్తి పోటు వల్ల 46 ఏళ్ల హసీనా, 23, 21, 12 ఏళ్ల వయసున్న ఆమె ముగ్గురు పిల్లలు మరణించారు.

దీపావళి బోనస్‌ ఇవ్వలేదని ఓనర్‌ను హత్యచేసిన వర్కర్లు, మెడకు తాగు బిగించి, బండరాయితో కొట్టి చంపిన పనివాళ్లు

తీవ్రంగా గాయపడిన మరో మహిళను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.ఉడిపి జిల్లా ఎస్పీ అరుణ్ కుమార్ ఘటనా స్థలాన్ని సందర్శించారు. మృతురాలి భర్త గల్ఫ్‌లో ఉద్యోగం చేస్తున్నట్లు తెలిసిందన్నారు. మహిళ, ఆమె ముగ్గురు పిల్లల హత్యకు కారణం ఏమిటన్నదని తెలియదని చెప్పారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

Advertisement
Share Now
Advertisement