Karnataka: మరొకరితో పడుకోమన్న భర్త, తట్టుకోలేక మొగుడ్ని రాడ్‌తో కొట్టి చంపేసిన రెండో భార్య, కేసును దర్యాప్తు చేస్తున్న బెంగుళూరు పోలీసులు 

కర్ణాటకలో దారుణ ఘటన చోటు (Karnataka) చేసుకుంది. ఓ రియల్టర్ ను అతని రెండో భార్య ఇనుప రాడ్ తో కొట్టి హత్య చేయడం స్థానికంగా సంచలనం రేపింది. అనంతరం ఆ మహిళ నేరుగా వెళ్లి పోలీస్ స్టేషన్ లో లొంగిపోయింది.

Dead Representational Image (Photo Credits ANI)

Bengaluru, Nov 10: కర్ణాటకలో దారుణ ఘటన చోటు (Karnataka) చేసుకుంది. ఓ రియల్టర్ ను అతని రెండో భార్య ఇనుప రాడ్ తో కొట్టి హత్య చేయడం స్థానికంగా సంచలనం రేపింది. అనంతరం ఆ మహిళ నేరుగా వెళ్లి పోలీస్ స్టేషన్ లో లొంగిపోయింది. కర్ణాటక లోని బెంగళూరు రూరల్ జిల్లా నెలమంగల తాలూకా మాదనాయకనహళ్లి పోలీస్‌స్టేషన్‌ (Madanayakanahalli Police Station) పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. మృతుడిని మదనాయకనహళ్లి నివాసి స్వామి రాజ్‌గా గుర్తించారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. స్వామి రాజ్‌ తన మొదటి భార్య నుంచి విడిపోయి బ్యూటీషియన్ అయిన నేత్ర (35)ని రెండో వివాహం చేసుకున్నాడు. నేత్రను రెండో భార్యగా పెళ్లి చేసుకున్న తర్వాత పలార్ స్వామి ఆమె పేరు మీద హారో క్యాతనహళ్లిలో రూ.6 కోట్లు ఖర్చుపెట్టి పెద్ద బంగ్లా నిర్మించి ఇచ్చాడు. తాను కూడా అక్కడి నుంచే వ్యాపార కలాపాలు నిర్వహించేవాడు. అయితే అతనికి ఇతరుల భార్యల మీద మోజు పడింది. ఈ నేపథ్యంలో వేరొకరితో శారీరక సంబంధం పెట్టుకోవాలని (husband-was-forcing-wife-to-have-sex-with-another-man) రెండో భార్యను కోరాడు,

పోర్న్‌కు బానిసై..చిన్నారులపై అత్యాచారం, రేప్ సమయంలో బాలిక అరిచిందని చంపేసిన కామాంధుడు, గుజరాత్‌లో దారుణ ఘటన, నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు

శారీరకంగా హింసించడం మొదలుపెట్టాడు. ఇందుకు నేత్ర అంగీకరించక పోవడంతో ఈ విషయమై వారిద్దరికి గొడవ కూడా జరిగాయి. చివరికి సహనం కోల్పోయిన ఆమె అతను నిద్రిస్తున్న సమయంలో తన భర్త ని రాడ్ తో కొట్టి హత్య చేసి పోలీసులకు లొంగిపోయింది. తదుపరి విచారణ నిమిత్తం ఆమెను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

ఇదిలా ఉంటే ఆస్తి తగాదా విషయంలో బాధితురాలికి, నిందితుడికి మధ్య గొడవ జరిగిందని బాధితుడి మొదటి భార్య ఆరోపించింది. నేత్ర, రాజ్‌లకు ఐదేళ్ల క్రితం వివాహమైందని, ఆస్తి తగాదాల కారణంగా తరచూ గొడవలు జరుగుతుంటాయని, ఇదే హత్యకు కారణమని రాజ్‌ మొదటి భార్య సత్యకుమారి పోలీసులకు తెలిపారు. ఆమె మదనాయకనల్లి పోలీసులకు దీనిపై ఫిర్యాదు చేసిందని చేసిందని దర్యాప్తు అధికారి తెలిపారు. కాగా పోలీసులు అన్ని కోణాల్లో ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు.

పెళ్లికి ఒప్పుకోలేదని లవర్  గొంతు కోసి చంపేసిన ప్రేమోన్మాది, పెద్దపల్లి జిల్లాలో దారుణ ఘటన, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న గోదావరిఖని పోలీసులు

గత నెలలో జరిగిన మరో ఘటనలో ప్రియుడి సూచన మేరకు మైసూరులో ఓ మహిళ తన భర్తను హత్య చేసింది. ఈ ఘటన అక్టోబర్ 9న జరిగింది. నివేదికల ప్రకారం, ఉమ అనే మహిళ తన భర్తను అపస్మారక స్థితికి తీసుకువచ్చిన తర్వాత అతని వృషణాలను నొక్కి చంపింది. పోలీసులు ఉమతో పాటు ఆమె ప్రియుడు అవినాష్‌ను అదుపులోకి తీసుకున్నారు.

Share Now

Advertisement
Share Now
Advertisement