Karnataka Refrigerator Blast: కర్ణాటకలో ఘోర అగ్నిప్రమాదం.. ఇంట్లో రిఫ్రిజిరేటర్ పేలి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు సజీవదహనం, ఇద్దరికి తీవ్ర గాయాలు..
కర్ణాటకలోని బెళగావి జిల్లా చావత్ గల్లీలో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఒక నివాస గృహంలో రాత్రి వేళ ఒక్కసారిగా రిఫ్రిజిరేటర్ (ఫ్రిజ్) పేలిపోవడంతో మంటలు చెలరేగి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులు సజీవదహనమవ్వగా.. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారని మార్కెట్ పోలీస్ స్టేషన్ అధికారులు మంగళవారం ధ్రువీకరించారు
Karnataka Refrigerator Blast: కర్ణాటకలోని బెళగావి జిల్లా చావత్ గల్లీలో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఒక నివాస గృహంలో రాత్రి వేళ ఒక్కసారిగా రిఫ్రిజిరేటర్ (ఫ్రిజ్) పేలిపోవడంతో మంటలు చెలరేగి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులు సజీవదహనమవ్వగా.. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారని మార్కెట్ పోలీస్ స్టేషన్ అధికారులు మంగళవారం ధ్రువీకరించారు. సోమవారం రాత్రి ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ ప్రమాదంలో గజానన్ ధామోన్ (65), రోషన్ ధామోన్ (21), శారద ధామోన్ (45), భారతి ధామోన్ (50) అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. కాగా ప్రియా ధమోన్ (28), గంగా ధమోన్ (25)లు తీవ్ర అగ్నిగాయాల బారిన పడ్డారు. సమాచారం అందుకున్న వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు గాయపడిన వారిని సమీప ఆసుపత్రికి తరలించి అత్యవసర చికిత్స అందిస్తున్నారు.
మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం.. ట్రక్, పికప్ వ్యాన్ ఢీకొని ముగ్గురు చిన్నారులు సహా 8 మంది మృతి
ఇంట్లోని రిఫ్రిజిరేటర్ ఒక్కసారిగా భారీ శబ్దంతో పేలడంతో క్షణాల్లో మంటలు ఇల్లంతా వ్యాపించాయని ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ప్రమాద సమయంలో ఇంట్లోని వారంతా గాఢ నిద్రలో ఉండటం, అగ్నికీలలు వేగంగా వ్యాపించి ఆవరణను ముంచెత్తడంతో బాధితులు బయటకు తప్పించుకునే అవకాశం లేకుండా పోయిందని అధికారులు వెల్లడించారు. మార్కెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు, విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణమా లేక సాంకేతిక లోపమా అనే కోణంలో తదుపరి దర్యాప్తును వేగవంతం చేశారు.