Karnataka Shocker: ముసలోడు కాదు కామాంధుడు, జ్యూస్ ఇస్తా రమ్మంటూ బాలికను ఇంట్లోకి తీసుకువెళ్లాడు, మత్తు మందు ఇచ్చి సాయంత్రం వరకు దారుణంగా రేప్, విషయం తెలిసి అతన్ని కొట్టి చంపిన బాలిక తల్లిదండ్రులు

బెంగళూరులో హెణ్ణూరు పోలీస్‌స్టేషన్‌ పరిధిలో దారుణ ఘటన (Karnataka Shocker) చోటు చేసుకుంది. మైనర్‌ బాలికకు పండ్లరసంలో మద్యం కలిపి తాగించి ఓ వృద్ధుడు (73-year-old) అత్యాచారానికి పాల్పడ్డాడు. అది తెలిసిన బాధితురాలి కుటుంబ సభ్యులు అతడిని చితకబాదారు.

Man thrashes wife for failing to conceive a child (Representational: Getty)

Bengaluru, Dec 13: బెంగళూరులో హెణ్ణూరు పోలీస్‌స్టేషన్‌ పరిధిలో దారుణ ఘటన (Karnataka Shocker) చోటు చేసుకుంది. మైనర్‌ బాలికకు పండ్లరసంలో మద్యం కలిపి తాగించి ఓ వృద్ధుడు (73-year-old) అత్యాచారానికి పాల్పడ్డాడు. అది తెలిసిన బాధితురాలి కుటుంబ సభ్యులు అతడిని చితకబాదారు. దాడిలో తీవ్ర గాయాల పాలైన ఆ వృద్ధుడు మరణించాడు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను సోమవారం తూర్పు విభాగం డీసీపీ భీమాశంకర్‌ గుళేద్‌ వెల్లడించారు.

తమిళనాడుకు చెందిన కుప్పణ్ణ (72) గత నాలుగేళ్లుగా హెణ్ణూరు పరిధిలోని బాబుసాపాళ్యలో ఒంటరిగా నివాసం ఉంటున్నాడు. ఇతడు తాపీ కూలీగా పనిచేసేవాడు. ఆదివారం మధ్యాహ్నం పక్కింట్లో ఉండే నాలుగేళ్ల బాలిక ఇంటిపైన ఆరేసిన దుస్తులను తీసుకురావడానికి వెళ్లింది. అక్కడే ఉన్న కుప్పణ్ణ బాలికకు జ్యూస్‌ ఇస్తానని చెప్పి ఇంట్లోకి పిలిపించుకున్నాడు. సరేనని వెళ్లిన బాలికకు జ్యూస్‌లో మద్యం కలిపి ఇవ్వగా తాగిన బాలిక మత్తులోకి జారుకుంది. అనంతరం వృద్ధుడు బాలికపై అత్యాచారానికి (sexual abuse) పాల్పడ్డాడు.

మియాపూర్‌లో మరో దారుణం, మాట్లాడటం లేదని ప్రియురాలిని కత్తితో పొడిచిన యువకుడు, అనంతరం గొంతు కోసుకుని ఆత్మహత్యా ప్రయత్నం

సాయంత్రం వరకు బాలిక ఇంటికి రాకపోవడంతో కుటుంబసభ్యులు చుట్టుపక్కల గాలించారు. కుప్పణ్ణ ఉండే ఇంటిపై అంతస్తులో బాలిక స్పృహ తప్పి ఉన్నట్లు తెలిసి బాలికను తీసుకుని ఆసుపత్రికి వెళ్లారు. బాలిక జరిగిన దారుణం చెప్పడంతో బంధువులు కోపంతో కుప్పణ్ణను తీవ్రంగా కొట్టారు. ఈ దాడితో అతను ప్రాణాలు వదిలాడు.

తాగొచ్చి కొడుకును కొట్టిన తండ్రి, కోపం ఆపుకోలేక తండ్రిని 32 ముక్కలుగా నరికి వాటిని బోరు బావిలో పడేసిన కొడుకు, కర్ణాటక బాగల్‌కోట్‌లో దారుణ ఘటన

మరోవైపు కుప్పణ్ణ తమ బాలిక మీద లైంగిక దాడి చేశాడని హెణ్ణూరుపోలీస్‌స్టేషన్‌ కు వెళ్లి ఫిర్యాదు చేశారు. సోమవారం ఉదయం పోలీసులు ఘటనాస్థలానికి వెళ్లి గమనించగా కుప్పణ్ణ శవమై ఉన్నాడు. కుప్పణ్ణ పై పోక్సోయాక్టు కేసు, బాలిక కుటుంబసభ్యులపై హత్యకేసు నమోదైందని డీసీపీ తెలిపారు. హత్య కేసులో ముగ్గురిని అరెస్టు చేశామని చెప్పారు.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement