Karnataka Shocker: దారుణం, దుష్ట శక్తులు ఆవహించాయంటూ మైనర్ బాలికపై మత గురువు ఆరు నెలల పాటు అత్యాచారం, ఆమె తమ్ముడు కూడా దారుణంగా..

వెంటనే నయం చేయాలంలూ ఓ మైనర్ బాలికపై ఓ ముస్లీం మత గురువు పలుమార్లు అత్యాచారానికి పాల్పడిన ఘటన కర్ణాటకలో వెలుగు చూసింది. మౌల్వీని కర్ణాటక పోలీసులు సోమవారం చిత్రదుర్గలో అరెస్టు చేశారు.

Rape (Rep Image)

చిత్రదుర్గ, జూన్ 3: మీ కూతురు దుష్టశక్తుల బారిన పడింది. వెంటనే నయం చేయాలంలూ ఓ మైనర్ బాలికపై ఓ ముస్లీం మత గురువు పలుమార్లు అత్యాచారానికి పాల్పడిన ఘటన కర్ణాటకలో వెలుగు చూసింది. మౌల్వీని కర్ణాటక పోలీసులు సోమవారం చిత్రదుర్గలో అరెస్టు చేశారు. మౌల్వీ.. బాధితురాలి సోదరుడిని కూడా ఆమెపై అత్యాచారం చేసేలా భయభ్రాంతులకు గురి చేశాడు. చిత్రదుర్గ మహిళా పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటనపై పోలీసులు నిందితుడు మౌల్వీపై పోక్సో కేసు నమోదు చేశారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, మైనర్ బాధితురాలు మూడేళ్లుగా ఖురాన్ చదవడానికి మసీదుకు వెళ్లింది. ఆమెకు దుష్టశక్తులు ఉన్నాయని, ఆమె ఇంట్లో ప్రత్యేక పూజలు నిర్వహించాలని నిందితుడు ఆమె తల్లిదండ్రులకు తెలియజేశాడు. ఆరు నుంచి ఏడు నెలల పాటు వారానికోసారి బాలిక ఇంటికి వెళ్లేవాడు. అతను సందర్శించిన ప్రతిసారీ, అతను బాధితురాలిని, ఆమె సోదరుడిని ఒక గదిలోకి తీసుకెళ్లాడు. గది నుండి బయట ఉండమని తల్లిదండ్రులను కోరాడు. మౌల్వీ బాధితురాలి సోదరుడి బ్రెయిన్ వాష్ చేసి, ఆమెకు దుష్టశక్తులు ఉన్నాయని, ఆమెతో లైంగికంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని నమ్మించాడు. బాధితురాలికి వైద్యం చేయించే పేరుతో లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు.  హైదరాబాద్‌లో దారుణం, పెళ్ళి చేసుకుందామని నమ్మించి మైనర్ బాలికపై అత్యాచారం, గర్భం దాల్చిన బాలిక, నిందితుడు అరెస్ట్

నిందితుడు ఈ చర్యను రికార్డ్ చేశాడు. ఆమె తమ్ముడు ఆమెపై అత్యాచారం చేశాడు. ఈ దారుణం ఆరు నెలల పాటు కొనసాగింది. కూతురు కడుపునొప్పి రావడంతో తల్లిదండ్రులు వైద్యుడి వద్దకు తీసుకెళ్లడంతో ఘటన వెలుగులోకి వచ్చింది. బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు తదుపరి విచారణ జరుపుతున్నారు. బాధితురాలి సోదరుడిపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.