Representative Image (Photo Credits: IANS)

Bhopal, Feb 28: చిన్నారులపై (Girl Child) అఘాయిత్యాలు (Rape) అంతకంతకూ పెరిగిపోతున్నాయి.  మధ్యప్రదేశ్‌ లోని శివపురి జిల్లాలో ఘోరం జరిగింది. పొరుగింట్లో నివసిస్తున్న ఓ యువకుడు చేసిన   లైంగికదాడిలో ఐదేళ్ల చిన్నారి తీవ్రంగా గాయపడింది. నిందితుడు అత్యంత పాశవికంగా ప్రవర్తించడంతో చిన్నారి ప్రైవేటు భాగాలపై 28 కుట్లు పడ్డాయి. శరీరం మొత్తం పంటి గాయాలయ్యాయి. ప్రస్తుతం చిన్నారి ఐసీయూలో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. అసలేం జరిగిందంటే.. ఈ నెల 22న రాత్రి  పొరుగునున్న ఝాన్సీ జిల్లాలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధిత బాలిక తండ్రిని చూసేందుకు చిన్నారి తాత, నానమ్మ ఆసుపత్రికి వెళ్లారు. దీనిని అవకాశంగా తీసుకున్న పక్కింటిలోని నిందితుడు బాలికకు మాయమాటలు చెప్పి పాడుబడిన ఇంట్లోకి తీసుకెళ్లి అఘాయిత్యానికి పాల్పడ్డాడు.

సీనియర్ నటి జయప్రద ఇంట్లో విషాదం.. సోదరుడు రాజబాబు కన్నుమూత

ఉరి తీయాల్సిందే..

ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. అయితే, తన మనమరాలిపై దారుణానికి ఒడిగట్టిన నిందితుడిని బహిరంగంగా ఉరితీయాలని బాలిక తాతయ్య డిమాండ్ చేశారు. బాలిక అపహరణకు గురైన సమయంలో ఇంటి ముందు ఆడుకుంటోందని, ఆమె తల్లి ఇంట్లో చిన్న కుమారుడితో ఉన్నట్టు స్థానికులు తెలిపారు.

నేపాల్‌ లో భూకంపం.. రిక్టర్ స్కేలుపై తీవ్రత 6.1గా న‌మోదు.. వరుస భూకంపాలతో భయాందోళనలో ప్రజలు (వీడియో)