Rape Case Against MLA Mukesh: ఆ ఎమ్మెల్యే రూంకి పిలిచి నన్ను రేప్ చేశాడు, పోలీసులకు ఫిర్యాదు చేసిన ప్రముఖ నటి, నటుడు ముకేశ్‌పై అత్యాచారం కేసు నమోదు చేసిన పోలీసులు

ప్రముఖ న‌టుడు, కేర‌ళ‌లోని అధికార పార్టీ సీపీఐ(ఎం) ఎమ్మెల్యే ఎమ్ ముకేశ్‌పై పోలీసులు అత్యాచారం కేసు నమోదు చేశారు. కొన్నేళ్ల క్రితం తనను ముకేశ్ లైంగిక వేధించాడంటూ ఓ నటి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు న‌మోదు చేసినట్లు అధికారులు వెల్ల‌డించారు.

Mukesh Booked for Rape on Actress' Plaint (Photo-Insta)

మళయాళం చిత్రసీమ మాలీవుడ్‌లో మహిళలు ఎదుర్కొంటున్న ఇబ్బందికర పరిస్థితులపై జస్టిస్‌ హేమ కమిటీ రూపొందించిన నివేదిక ద్వారా పలు దిగ్భ్రాంతికర విష‌యాలు బయటకు వ‌చ్చిన విష‌యం తెలిసిందే. దాంతో ఈ నివేదిక‌పై ప్ర‌స్తుతం దేశ‌వ్యాప్తంగా చర్చ జ‌రుగుతోంది. కాగా, క‌మిటీ రిపోర్టు స‌మ‌ర్పించిన త‌ర్వాత బాధితులు ఒక్కొక్క‌రుగా బ‌య‌ట‌కు వ‌చ్చి తాము గ‌తంలో ఎదుర్కొన్న వేధింపులను బ‌య‌ట‌పెడుతున్నారు. ఈ రిపోర్ట్ కార‌ణంగా ఇప్పటి వరకు లైంగిక వేధింపుల ఆరోపణల నేప‌థ్యంలో 17 కేసుల వరకు నమోదయ్యాయని స‌మాచారం.  నువ్వే అత్యాచారానికి గురైనట్లు రిపోర్ట్ చేస్తున్నావా, జర్నలిస్టుపై విరుచుకుపడిన శివసేన నేత, చివరకు ఏమన్నారంటే..

తాజాగా మరో కొత్త‌ కేసు నమోదైంది.ప్రముఖ న‌టుడు, కేర‌ళ‌లోని అధికార పార్టీ సీపీఐ(ఎం) ఎమ్మెల్యే ఎమ్ ముకేశ్‌పై పోలీసులు అత్యాచారం కేసు నమోదు చేశారు. కొన్నేళ్ల క్రితం తనను ముకేశ్ లైంగిక వేధించాడంటూ ఓ నటి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు న‌మోదు చేసినట్లు అధికారులు వెల్ల‌డించారు.

కొచి నగరంలోని మారడు పీఎస్‌లో ఐపీసీ 376(రేప్) సెక్షన్ కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు ఓ పోలీస్ అధికారి తెలిపారు. కాగా, హేమ కమిటీ నివేదిక వ‌చ్చిన‌ తర్వాత మలయాళ చిత్ర ప‌రిశ్ర‌మలో నమోదైన మూడో హై ప్రొఫైల్ కేసు ఇదే. అంత‌కుముందు నటులు జయసూర్య, మణియం పిళ్ల రాజుపై కూడా పోలీసులు కేసులు నమోదు చేసిన విష‌యం తెలిసిందే.

(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)

Share Now

Share Now