Kerala Shocker: తండ్రితో కలిసి తప్పతాగిన కొడుకు, అయినా మందు సరిపోలేదంటూ తల్లిని దారుణంగా హత్య చేసిన కసాయి, కేరళలో షాకింగ్ ఘటన

కేరళలో దారుణ ఘటన చోటు చేసుకుంది. తండ్రితో కలిసి మద్యం తాగేందుకు డబ్బులు ఇవ్వలేదని తల్లిని హత్య చేశాడు కసాయి కొడుకు. ఈ ఘటనలో తండ్రి ప్రమేయం కూడా ఉండటంతో ఇద్దర్నీ పోలీసులు అరెస్ట్ చేశారు

Representational Image | (Photo Credits: IANS)

ALAPPUZHA, Mar 9: కేరళలో దారుణ ఘటన చోటు చేసుకుంది. తండ్రితో కలిసి మద్యం తాగేందుకు డబ్బులు ఇవ్వలేదని తల్లిని హత్య చేశాడు కసాయి కొడుకు. ఈ ఘటనలో తండ్రి ప్రమేయం కూడా ఉండటంతో ఇద్దర్నీ పోలీసులు అరెస్ట్ చేశారు. కేరళలోని అలప్పుజ జిల్లాలో భరణిక్కవు సమీపంలోని కురతికాడ్‌ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది.

అలప్పుజ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..తండ్రి రామ్‌ మోహన్‌ మంగళవారం రాత్రి చిన్న కుమారుడు 30 ఏళ్ల మిథున్ మోహన్‌తో కలిసి మద్యం సేవించాడు.అయితే మద్యం అయిపోవడంతో మరింత మందు కావాలని తండ్రి అడగడంతో డబ్బులు కావాలని తల్లిని అడిగాడు కొడుకు. మద్యం తాగడం కోసం డబ్బులు ఇచ్చేందుకు తల్లి నిరాకరించడంతో ఆగ్రహించిన చిన్న కుమారుడు మిథున్‌, గొంతు నొక్కి తల్లిని హత్య చేశాడు. అనంతరం తండ్రితో కలిసి ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయాడు.

ఒళ్లు గగుర్పొడిచే వీడియో, ర్యాష్ డ్రైవింగ్ దెబ్బకు గాల్లో లేచి నుజ్జు నుజ్జుయిన మూడు కార్లు, జాగ్రత్తగా నడపకపోతే అంతే సంగతులు ఇక

మరుసటి రోజు మధ్యాహ్నం పెద్ద కుమారుడు ఇంటికి వచ్చి చూడగా నేలపై తల్లి విగతజీవిగా పడి ఉండటం చూసి షాకయ్యాడు. తల్లి మరణంపై అనుమానం వ్యక్తం చేసిన అతడు, వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చాడు. పోలీసులు ఇంటికి చేరుకుని వృద్ధురాలైన రమ మృతదేహాన్ని పరిశీలించారు. పోస్ట్‌మార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

తోటి విద్యార్థులే కామాంధులుగా మారి పదవతరగతి బాలికపై సామూహిక అత్యాచారం, రేప్ సీన్ వీడియో తీసి బెదిరిస్తూ మళ్లీ మళ్లీ అత్యాచారం, నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు

చిన్న కుమారుడు మిథున్‌ మోహన్‌ గురించి స్థానికంగా ఆరా తీశారు.మద్యం, డ్రగ్స్‌కు బానిస అయిన మిథున్‌ మోహన్‌ డబ్బుల కోసం పలుమార్లు తన తల్లిని కొట్టినట్లు పోలీసుల విచారణలో వెల్లడయింది. దీంతో అతడిని అరెస్ట్‌ చేశారు.తల్లి హత్యలో తండ్రి పాత్ర కూడా ఉన్నట్లు తెలుసుకుని అతన్ని కూడా అరెస్ట్ చేశారు.

(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)

Share Now

Share Now