Kerala Ex Teacher Arrested: టీచర్ కాదు కామ పిశాచి, 30 ఏళ్లలో 60 మంది విద్యార్థినులపై లైంగికవేధింపులు, తవ్వే కొద్ది బయటపడుతున్న వాస్తవాలు, పోలీసుల అదుపులో కీచకుడు..

ఒకటి కాదు రెండు కాదు ఏకంగా తన 30 ఏళ్ల సర్వీసులో 60 మంది విద్యార్థినులపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. కేరళలోని ఓ కీచక ఉపాధ్యాయుడి అఘాయిత్యాలు దేశవ్యాప్తంగా సంచలనంగా మారాయి.

Image used for representational purpose only | (Photo Credits: ANI)

మలప్పురం: చదువు చెప్పాల్సిన గురువు.. నిత్యం కామంతో రగిలిపోతూ, కూతురు లాంటి విద్యార్థినుల జీవితాలను తన లైంగిక వాంఛలకు బలిచేశాడు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా తన 30 ఏళ్ల సర్వీసులో 60 మంది విద్యార్థినులపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. కేరళలోని ఓ కీచక ఉపాధ్యాయుడి అఘాయిత్యాలు దేశవ్యాప్తంగా సంచలనంగా మారాయి. 30 ఏళ్ల సర్వీసులో ఆ కీచకుడు ఏకంగా 60 మంది విద్యార్థినులను లైంగికంగా వేధించినట్టు ఆరోపణలు రావడంతో పోలీసులు అతనిపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. దీంతోపాటు ఈ ఘటనపై విచారణ చేపట్టాలని కేరళ విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది.

పూర్తి వివరాల్లోకి వెళితే మలప్పురం మున్సిపాలిటీలో కౌన్సిలర్‌గా ఉన్న కేవీ శశికుమార్.. పట్టణంలోని సెయింట్ గెమాస్ గర్ల్స్ హయ్యర్ సెకండరీ స్కూల్‌లో ఉపాధ్యాయుడిగా పనిచేసి 2022 మార్చిలో రిటైర్ అయ్యాడు. ఉపాధ్యాయుడిగా పనిచేసిన సమయంలో వేధింపులకు గురి చేసినట్టు శశికుమార్‌కు వ్యతిరేకంగా పోలీసు కేసు నమోదైంది. అయితే ఈ విషయమై దాదాపు 50 మందికి పైగా కలసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. మూడు పర్యాయాలు కౌన్సిలర్‌గా పనిచేస్తుండడంతో రాజకీయ పలుకుబడితో అతడు రెచ్చిపోయినట్లు పేర్కొంటున్నారు.

ఇదిలా ఉంటే శశికుమార్ రిటైర్ అయ్యాడని ఫేస్ బుక్ ద్వారా తెలుసుకున్న ఓ మాజీ విద్యార్థిని ఒకరు అతడి రాస లీలలను బయటపెట్టింది. పోలీసులకు ఫిర్యాదు చేయగా, వరుసగా మరికొంత మంది మాజీ విద్యార్థినులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అతడి పాపం పండటంతో పలువురు ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. వారం రోజులుగా పరారీలో ఉన్న శశికుమార్‌ను పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. కేరళ విద్యాశాఖ మంత్రి శివన్ కుట్టి విచారణకు ఆదేశించారు. అంతేకాదు శివకుమార్‌ను పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్టు సీపీఎం ప్రకటించింది.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement