Sedition Law: దేశ ద్రోహం చట్టం రద్దు చేయాల్సిన అవసరం లేదు, దాన్ని మరింత కఠినతరం చేసేలా కొన్ని గైడ్‌లైన్స్‌ ఇస్తే సరిపోతుందని ప్రభుత్వానికి లా కమిషన్ సిఫారసు

దేశ ద్రోహం చట్టం గురించి లా కమిషన్‌ ప్రభుత్వానికి ఆసక్తికరమైన నివేదిక ఇచ్చింది. అందులో ఆ చట్టాన్ని రద్దు చేయాల్సిన అవసరం లేదని, దాన్ని మరింత కఠినతరం చేసేలా కొన్ని గైడ్‌లైన్స్‌ ఇస్తే సరిపోతుందని పేర్కొంది.

Sedition Law | Representational Image (Photo Credits: Pexels)

దేశ ద్రోహం చట్టం గురించి లా కమిషన్‌ ప్రభుత్వానికి ఆసక్తికరమైన నివేదిక ఇచ్చింది. అందులో ఆ చట్టాన్ని రద్దు చేయాల్సిన అవసరం లేదని, దాన్ని మరింత కఠినతరం చేసేలా కొన్ని గైడ్‌లైన్స్‌ ఇస్తే సరిపోతుందని పేర్కొంది. రాజద్రోహాన్ని నేరంగా పరిగణించడం కొనసాగించాలని, అంతేకాకుండా శిక్షా కాలాన్ని మూడేళ్ల నుంచి ఏడేళ్లకు పెంచాలని, అయితే కొన్ని సవరణలు అవసరమని శాసన పరిశీలన సంఘం (Law Commission) ప్రభుత్వానికి సిఫారసు చేసింది.

ఈ విషయమై ప్రభుత్వానికి నివేదికలో సూచనలు కూడా ఇచ్చింది. ఆ చట్టమే భారతదేశాన్ని ఐక్యతగా ఉంచడంలో ఉపకరిస్తోంది, సార్వభౌమత్వాన్ని పరిరక్షించడానికి, తీవ్రవాదాన్ని ఎదుర్కొనడంలో సహాయపడుతుందని వెల్లడించింది. అంతేగాదు దేశద్రోహం కేసులో విధించే జైలు శిక్షను మూడేళ్ల నుంచి ఏడేళ్లకు పెంచాలని కమిషన్‌ నివేదికలో ప్రభుత్వాన్ని సూచించింది.

యువతి మెడ కోసి దారుణ హత్య, రక్తం కారుతున్న ఆ శవంపై కామాంధుడు అత్యాచారం, అది నేరం కాదంటూ నిందితుడిని నిర్దోషిగా విడుదల చేసిన కర్ణాటక హైకోర్టు

భారత శిక్షా స్మృతి (IPC)లోని సెక్షన్ 124ఏను కొన్ని సవరణలతో కొనసాగించాలని తెలిపింది. విశ్రాంత కర్ణాటక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రితు రాజ్ అవస్థి నేతృత్వంలోని కమిషన్ ఈ సిఫారసు చేసింది.వలసవాద వారసత్వంగా ఉన్న దేశద్రోహం రద్దుకు సరైన కారణం లేదని జస్టిస్‌ రీతు రాజ్‌ అవస్తీ(రిలైర్డ​) నేతృత్వంలోని లా కమిషన్‌ పేర్కొంది. దేశద్రోహం చట్టాన్ని సమీక్షించాలని సుప్రీం కోర్టు కేంద్రాన్ని కోరుతున్న నేపథ్యంలో ఈ నివేదికి రావడం గమనార్హం.

వాస్తవానికి న్యాయవ్యవస్థ మొత్తం వలసవాద వారసత్వమే అని నివేదిక తేల్చి చెప్పింది. అలాగే సెక్షన్‌ 124ఏ దుర్వినియోగంపై అభిప్రాయాలను స్వీకరించామని, వాటిని అరికట్టేలా మోడల్‌ మార్గదర్శకాలను కేంద్రం జారీ చేయాలని సిఫార్సు చేస్తున్నామని నివేదికలో తెలిపింది. ఈ సందర్భంగా ఐపీసీ సెక్షన్‌ 124ఏకి కింద నేరానికి సంబంధించి ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయడానికిక ముందు.. క్రిమినల్‌ ప్రోసీజర్‌ కోడ్‌ 1973 సీర్పీసీ సెక్షన్‌ 196(3)కి సమానమైన సీర్పీసీ 154 సెక్షన్‌కి ఒక నిబంధనగా ప్రత్యామ్నాయంగా చేర్చవచ్చని సూచించింది.

వావి వరసలు మరిచి అన్న భార్యతో అక్రమ సంబంధం, మూడేళ్ల పాటు అదే పని, ఆమె నుంచి పెళ్ళి ఒత్తిడి రావడంతో చంపేసిన కసాయి

ఇది అవసరమైన విధానపరమైన భద్రతను అందిస్తుంది అని లా కమిషన్‌ చైర్మన్‌ అవస్తీ(రిటైర్డ్‌) న్యాయమంత్రి అర్జున్‌రామ్‌ మేఘ్‌వాల్‌కు తన నివేదికలో తెలిపారు. చట్ట విరుద్ధ కార్యకలాపా చట్టం, జాతీయ భద్రతా చట్టం వంటి చట్టాలు ఐపీసీ సెక్షన్‌ 124ఏ కింద సూచించబడిన నేరాలకు సంబంధించిన అన్ని అంశాలను కవర్‌ చేయదని అందువల్ల దేశద్రోహం చట్టాన్ని కొనసాగించాలని లా కమిషన్‌ నొక్కి చెప్పింది.

ఇదిలా ఉండగా దేశద్రోహ చట్టం హేతుబద్ధతను పునఃపరిశీలిస్తామని చెబుతూ కేంద్రం అఫడవిట్‌ దాఖలు చేయడమే గాక రాజ్యంగ చెల్లుబాటును నిర్ధారించే కసరత్తును వాయిదావేయాలని అభ్యర్థించింది. సుప్రీం కోర్టు వలస రాజ్యాల కాలం నాటి నిబంధననను గట్టిగా సమర్థించడం తోపాటు దానిని సవాలు చేస్తూ దాఖలు చేసిన పిటిషన్‌లను కొట్టివేయాలని కోరిన తర్వాత కేంద్ర ప్రభుత్వ ఈ చట్టాన్ని పునఃపరిశీలించేందుకు అంగీకరించింది.

ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం సుప్రీం కోర్టులో ఒక తాజా పిటిషన్‌ దాఖలు చేసింది. కాగా, గతేడాది దేశ 75వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని అజాది కా అమృతోత్సవాల్లో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ వలసరాజ్యల యుగం నాటి చట్టం గురించి ప్రస్తావించారు. ఆ చట్ట ప్రయోజనాన్ని మించి పోయి ఉందని వెంటనే దాన్ని రద్దు చేయాలనే అభిప్రాయన్ని వెలిబుచ్చారు.

రాజద్రోహం అనేది వలస పాలకుల నుంచి వచ్చిన చట్టమని చెప్పడం దానిని రద్దు చేయడానికి తగిన కారణం కాదని స్పష్టం చేసింది. రాజద్రోహాన్ని నేరంగా పరిగణించే నిబంధనలు బ్రిటిష్ పాలనా కాలంలో వచ్చాయని, భారత దేశ స్వాతంత్ర్య సమర యోధులపై ఈ చట్టాన్ని ప్రయోగించారని చెప్తూ, దీనిని రద్దు చేయాలని కోరడం సరికాదని, దీనిని రద్దు చేయడానికి అవి సరైన కారణాలు కాదని తెలిపింది. ఆ మాటకు వస్తే మొత్తం భారతీయ న్యాయ వ్యవస్థకు వలస పాలన వారసత్వం ఉందని లా కమిషన్ వివరించింది.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement