Lightning Strikes Man In Maharashtra: గనిలో పనిచేసుకుంటుండగా నడినెత్తిపై పిడుగు, సీసీటీవీలో రికార్డయిన షాకింగ్ వీడియో

అకాల వర్షాలతో అన్నదాతలకు భారీగా పంటనష్టం జరిగింది. మరోవైపు కొన్ని ప్రాంతాల్లో గాలివాన, ఈదురుగాలులు, పిడుగులు బీభత్సం సృష్టించాయి. తాజాగా మహారాష్ట్రలోని చంద్రాపూర్ జిల్లాలో (Chandrapur) పిడుగులు పలువురి ప్రాణాలు బలిగొన్నాయి. చంద్రాపూర్‌ జిల్లాలోని బొగ్గుగనుల్లో పనిచేస్తున్న ఓ కార్మికుడి నడినెత్తిమీద పిడుగు (Lightning Strike) పడింది.

Lighting Strikes Man In Maharashtra (PIC @ Viral Video)

Chandrapur, April 26: అకాల వర్షాలతో అన్నదాతలకు భారీగా పంటనష్టం జరిగింది. మరోవైపు కొన్ని ప్రాంతాల్లో గాలివాన, ఈదురుగాలులు, పిడుగులు బీభత్సం సృష్టించాయి. తాజాగా మహారాష్ట్రలోని చంద్రాపూర్ జిల్లాలో (Chandrapur) పిడుగులు పలువురి ప్రాణాలు బలిగొన్నాయి. చంద్రాపూర్‌ జిల్లాలోని బొగ్గుగనుల్లో పనిచేస్తున్న ఓ కార్మికుడి నడినెత్తిమీద పిడుగు (Lightning Strike) పడింది.  భారీ వర్షం పడుతుండటంతో...అప్పటికే గనుల్లో పనిచేస్తున్న వ్యక్తి సురక్షిత ప్రాంతానికి పరిగెత్తాడు. ఈ క్రమంలో అతను వెళ్తుండగా నేరుగా పిడుగు పడింది.

దాంతో అతను అక్కడికక్కడే కుప్పకూలాడు. దీనికి సంబంధించిన వీడియో సీసీటీవీలో (CCTV) రికార్డయింది. ఈ వీడియోను చూసిన ప్రజలు షాకవుతున్నారు. పిడుగుపాటు ధాటికి కుప్పకూలిన వ్యక్తిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మరణించాడు.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement