Ludhiana Shocker: ఇంట్లో ఖాళీగా ఉంటూ కూతురిపై అత్యాచారం, పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితురాలి తల్లి, కేసు నమోదు చేసిన పోలీసులు
వావి వరసలు మరచిన కామాంధుడే ఏకంగా సహజీవనం చేస్తున్న కూతురిపైన అత్యాచారానికి ఒడిగట్టాడు.
Ludhiana, Jan 12: చండీఘడ్ రాష్ట్రంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. వావి వరసలు మరచిన కామాంధుడే ఏకంగా సహజీవనం చేస్తున్న కూతురిపైన అత్యాచారానికి ఒడిగట్టాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... ఓ మహిళ తన భర్తని ఆరేళ్ల క్రితం విడిచిపెట్టి ఒంటరిగా తన కూతురితో జీవనం గడుపుతోంది. రెండేళ్ల క్రితం ఆమెకు డ్రైవర్‌గా పనిచేస్తున్న ఓ వ్యక్తితో పరిచయం ఏర్పడింది.
కొన్ని రోజులకు అది కాస్త వారి మధ్య సాన్నిహిత్యాన్ని పెంచింది. దీంతో ఆ మహిళ డ్రైవర్ తో కొన్నాళ్లుగా సహజీవనం చేస్తోంది. కొన్ని నెలల క్రితం, అతను డ్రైవర్ ఉద్యోగం కోల్పోవడంతో ఇంటి వద్దే ఉంటున్నాడు. ఈ క్రమంలో ఇంట్లో ఉన్న ఆ మహిళపై కూతురిపై కన్నేసి లైంగిక దాడికి (rape of live-in partner’s minor daughter) పాల్పడ్డాడు. బాలిక ఈ దారుణాన్ని తన తల్లికి చెప్పింది. ఈ సంఘటన ఎవరికీ చెప్పవద్దని బెదిరించారని ఆమె కుమార్తె చెప్పింది. దీంతో మహిళ అతన్ని నిలదీయగా ఆమెతో ఘర్షణకు దిగి పారిపోయాడు. మహిళా ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు (38-year-old man booked for rape) చేసి గాలింపు ముమ్మరం చేశారు.
ప్రస్తుతం పరారీలో ఉన్న నిందితుడిపై భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 376 (రేప్), లైంగిక నేరాల నుంచి పిల్లల రక్షణ చట్టంలోని సెక్షన్ 6 కింద కేసు నమోదు చేసినట్లు మోతీ నగర్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ (ఎస్‌హెచ్‌ఓ) ఇన్‌స్పెక్టర్ రవీందర్ కుమార్ తెలిపారు. . అతని కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టినట్లు ఎస్‌హెచ్‌ఓ తెలిపారు.