MP Shocker: బావ కాదు కామాంధుడు, రాత్రిపూట పశువులకు గడ్డి వేసేందుకు వెళ్లిన మరదలిపై అత్యాచారం, గర్భం దాల్చిన మైనర్ మరదలు, నిందితుడు అరెస్ట్
ఓ మైనర్ పై ఆమె మేనబావ అత్యాచారానికి (Minor Girl Raped) పాల్పడ్డాడు. ఆమె గర్భం దాల్చడంతో ఈ విషయంఓ వెలుగులోకి వచ్చింది.మధ్యప్రదేశ్‌లోని ఖర్గోనే ప్రాంతంలో మైనర్ బాలికపై కన్నేసిన బావ (Brother-in-Law in Khargone) ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు.
Bhopal, July 12: మధ్య ప్రదేశ్ రాష్ట్రంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ మైనర్ పై ఆమె మేనబావ అత్యాచారానికి (Minor Girl Raped) పాల్పడ్డాడు. ఆమె గర్భం దాల్చడంతో ఈ విషయంఓ వెలుగులోకి వచ్చింది.మధ్యప్రదేశ్‌లోని ఖర్గోనే ప్రాంతంలో మైనర్ బాలికపై కన్నేసిన బావ (Brother-in-Law in Khargone) ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు.
బాధితురాలికి కడుపు నొప్పి రావడంతో పరిశీలించిన వైద్యులు ఆమె మూడునెలల గర్భవతిగా నిర్ధారించారు. కేసు నమోదు చేసిన పోలీసులు బాలిక స్టేట్‌మెంట్‌ను రికార్డు చేశారు. తరచూ తమ ఇంటికి వచ్చిపోయే బావ లైంగిక వేధింపులకు గురిచేశాడని, ఓ రోజు రాత్రి పశువులకు మేత వేసేందుకు వెళుతున్న సమయంలో తనపై బలవంతంగా లైంగిక దాడికి పాల్పడ్డాడని బాలిక తెలిపింది. నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు అతడిని పట్టుకునేందుకు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మధ్యప్రదేశ్ లోని ఖర్గోన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ గ్రామంలో ఓ కుటుంబం జీవిస్తోంది. మూడు నెలల క్రితం ఆ గ్రామంలోకి చాచారియా జిల్లా బర్వానీ గ్రామానికి చెందిన గోవింద్ వచ్చాడు. బాధిత కుటుంబానికి బంధువైన అతడికి ఇప్పటికే పెళ్లయి ముగ్గురు పిల్లలు ఉన్నారు. మార్చి 20వ తేదీన అతడు ఆ గ్రామానికి వచ్చాడు. మైనర్ బాలిక రాత్రి సమయంలో వేరే ఇంట్లో ఉన్న మేకలకు గడ్డి వేయడానికి వెళ్లింది. ఆ మైనర్ కు అతడు బావ వరుస అవుతాడు. ఆ సమయంలో ఆ మైనర్ పై అత్యాచారానికి పాల్పడ్డాడు.
ఈ విషయాన్ని ఎవరికీ చెప్పొద్దని మైననర్ ను బెదిరించాడు. దీంతో ఆమె ఈ ఘటనపై ఎక్కడా నోరు విప్పలేదు. అయితే ఇటీవల కడుపు నొప్పి రావడంతో ఆమె గర్భవతి అని తేలింది. దీంతో ఏం జరిగిందని తల్లి ఆరా తీయగా అసలు విషయం వెల్లడించింది. దీంతో వారు పోలీసులను ఆశ్రయించారు. మైనర్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్టు బారుద్ టీఐ గెహ్లాద్ సెమాలియా తెలిపారు. ప్రస్తుతం నిందితుడు పరారీలో ఉన్నాడు. అతడి కోసం పోలీసు బృందాన్ని ఏర్పాటు చేసి గాలిస్తున్నారు.