Man Killed By His Brothers: కార్తీక మాసంలో ఇంటికి చికెన్ తెచ్చాడ‌ని త‌మ్ముడ్నిచంపిన ఇద్ద‌రు అన్న‌లు, ఆ ఇద్ద‌ర్నీ కాపాడేందుకు త‌ల్లి ఏం చేసిందంటే?

ఆ తర్వాత తల్లితో కలిసి అతడ్ని ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఇంటికి తిరిగి రాగానే స్పృహతప్పి పడిపోయాడని చెప్పారు. అయితే అన్షుల్‌ అప్పటికే చనిపోయినట్లు డాక్టర్లు తెలిపారు

Shocking Bengaluru woman killed, chopped into 30 pieces(X)

Bhopal, NOV 17: కార్తీక మాసం నేపథ్యంలో ఇంటికి చికెన్‌ తెచ్చిన తమ్ముడిపై అన్నలు ఆగ్రహించారు. ఈ సందర్భంగా జరిగిన ఘర్షణలో తాడుతో గొంతునొక్కి అతడ్ని హత్య చేశారు. (Man Killed For Bringing Chicken) మధ్యప్రదేశ్‌ రాజధాని భోపాల్‌లో ఈ సంఘటన జరిగింది. నవంబర్‌ 9న బైరాగఢ్ ప్రాంతంలోని ఇందిరా నగర్‌లో నివసించే ఒక కుటుంబానికి చెందిన ముగ్గురు అన్నాదమ్ములు మద్యం సేవించారు. మందు పార్టీలో చికెన్‌ కావాలని తమ్ముడైన 22 ఏళ్ల అన్షుల్ యాదవ్ పట్టుబట్టాడు. అయితే కార్తీక మాసం కావడంతో అన్నలు కుల్దీప్, అమన్‌ వద్దని చెప్పారు.

Vijayawada: రాంగ్ రూట్‌లో వ‌చ్చిన కారు, ఆపై బస్సు డ్రైవర్‌పైనే దాడి, విజయవాడలో ఘటన...ముగ్గురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు...వీడియో ఇదిగో 

కాగా, బయటకు వెళ్లిన అన్షుల్ కోడి మాంసం కొని ఇంటికి తీసుకువచ్చాడు. ఇది చూసి అన్నలైన కుల్దీప్, అమన్‌ ఆగ్రహం చెందారు. ఈ అంశంపై వారి మధ్య గొడవ జరిగింది. ఈ సందర్భంగా తాడుతో గొంతు నొక్కి తమ్మడు అన్షుల్‌ను హత్య చేశారు. ఆ తర్వాత తల్లితో కలిసి అతడ్ని ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఇంటికి తిరిగి రాగానే స్పృహతప్పి పడిపోయాడని చెప్పారు. అయితే అన్షుల్‌ అప్పటికే చనిపోయినట్లు డాక్టర్లు తెలిపారు.

Actress Kasturi: నటి కస్తూరికి బిగ్ షాక్.. 14 రోజుల రిమాండ్, చెన్నైలోని పుజ‌ల్ సెంట్ర‌ల్ జైలుకు త‌ర‌లించిన పోలీసులు  

మరోవైపు ఈ విషయం తెలుసుకున్న పోలీసులు అన్షుల్‌ మృతదేహాన్ని పరిశీలించారు. తాడుతో అతడి గొంతు నొక్కినట్లు ఉన్న ఆనవాళ్లపై తల్లి అనితను ప్రశ్నించారు. అయితే చిన్న కుమారుడ్ని పెద్ద కుమారులు హత్య చేయడాన్ని కప్పిపుచ్చేందుకు ఆమె ప్రయత్నించింది. హత్య చేసిన రోప్‌ను దాచింది. కాగా, తాడుతో అన్షుల్‌ గొంతు నొక్కి చంపినట్లు పోస్ట్‌మార్టమ్‌ రిపోర్ట్‌లో తేలింది. దీంతో అతడి అన్నలను పోలీసులు అరెస్ట్‌ చేశారు. హత్య ఆధారాన్ని దాచిన తల్లిపై కూడా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.



00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif