Delhi Shocker: గోడపై మూత్రం పోసినందుకు చేజ్ చేసి మరీ కత్తులతో పొడిచి చంపారు, ఢిల్లీలో పట్టపగలే దారుణం, సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన మర్డర్ వీడియో, నడిరోడ్డుపై చంపుతుంటే కనీసం ఆపని జనాలు
ఢిల్లీలోని మాలవీయ నగర్‌లో (Malviya Nagar) దారుణం జరిగింది. ఇంటి గోడపై మూత్ర విసర్జన (Urinating On Wall) చేశాడని వ్యక్తిని దారుణంగా హత్య చేశారు. గోడపై మూత్ర విసర్జణ చేస్తావా అంటూ సదరు వ్యక్తితో ఘర్షణ పడిన నలుగురు వ్యక్తులు పట్టపగలే అందరూ చూస్తుండగా కత్తులతో పొడిచి (stabbed him to death) దారుణంగా చంపారు.
New Delhi, AUG 13: ఢిల్లీలోని మాలవీయ నగర్‌లో (Malviya Nagar) దారుణం జరిగింది. ఇంటి గోడపై మూత్ర విసర్జన (Urinating On Wall) చేశాడని వ్యక్తిని దారుణంగా హత్య చేశారు. గోడపై మూత్ర విసర్జణ చేస్తావా అంటూ సదరు వ్యక్తితో ఘర్షణ పడిన నలుగురు వ్యక్తులు పట్టపగలే అందరూ చూస్తుండగా కత్తులతో పొడిచి (stabbed him to death) దారుణంగా చంపారు. ఈ సంఘటన ఓ బిజీ మార్కెట్లో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మయాంక్ హోటల్ మేనేజిమెంట్ డిగ్రీ చదువుతున్నారు. గురువారం మధ్యాహ్నం ఢిల్లీలోని (Delhi) రద్దీగా ఉండే ఓ ప్రాంతంలో మూత్రవిసర్జన చేశాడు. అయితే ఇంటి గోడపై మూత్ర విసర్జణ చేయడాన్ని గమనించిన ఇంటి యజమానురాలు అభ్యంతరం తెలిపింది. దీంతో ఇద్దరి మధ్య మాటా మాటా పెరిగింది. ఇద్దరు ఒకరిపై మరొకరు చేయి చేసుకున్నారు. తల్లిపై చేయి చేసుకోవడంతో ఆగ్రహించిన ఆమె కుమారుడు మనీష్ (manish).. తన స్నేహితులకు సమాచారం ఇచ్చి, మయాంక్‌ను (Mayank) పట్టుకునేందుకు చేజ్ చేశారు. చివరకు దక్షిణ ఢిల్లీకి చెందిన మాలవీయ నగర్‌లోని డీడీఏ మార్కెట్ వద్ద మయాంక్‌ను అడ్డగించి అందరూ చూస్తుండగానే కత్తులతో విచక్షణారహితంగా పొడిచి పారిపోయారు.
తీవ్రంగా రక్తస్రావమైన మయాంక్‌ను స్థానికులు చికిత్స కోసం ఎయిమ్స్‌కు (AIIMS) తరలించారు. చికిత్స పొందుతూ అతను మరణించారు. విద్యార్థిని పట్టుకుని నలుగురు కత్తులతో పొడిచి చంపిన సంఘటన సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు.. మాలవీయ నగర్‌లోని డీడీఏ మార్కెట్ ప్రాంతంలోని సీసీ కెమెరాల ఫుటేజీని స్వాధీనం చేసుకుని పరిశీలించారు.
మయాంక్‌ను నలుగురు కత్తులతో పొడిచి చంపినట్లు పోలీసులు గుర్తించారు. హత్యకు కారకులైన మనీష్‌తో పాటు అతడి స్నేహితులు రాహుల్, అశీష్, సూరజ్‌లుగా గుర్తించి, వారిని అదుపులోకి తీసుకున్నారు. మాలవీయ నగర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేపట్టారు.