Covid in India: దేశ రాజధానిలో కొనసాగుతున్న కరోనా కరోనా విజృంభణ , గత 24 గంటల్లో 10 మంది మృతి, భారత్‌లో కొత్తగా 15,815 కేసులు నమోదు
దేశంలో శుక్రవారం 16,561 పాజిటివ్ కేసులు నమోదవగా, శనివారం కొత్తగా 15,815 కేసులు (Coronavirus in India) రికార్డయ్యాయి. దీంతో మొత్తం కరోనా కేసులు 4,42,39,372కు చేరాయి. ఇందులో 4,35,93,112 మంది బాధితులు వైరస్ నుంచి కోలుకున్నారు.
New Delhi, August 13: దేశంలో శుక్రవారం 16,561 పాజిటివ్ కేసులు నమోదవగా, శనివారం కొత్తగా 15,815 కేసులు (Coronavirus in India) రికార్డయ్యాయి. దీంతో మొత్తం కరోనా కేసులు 4,42,39,372కు చేరాయి. ఇందులో 4,35,93,112 మంది బాధితులు వైరస్ నుంచి కోలుకున్నారు. ఇప్పటివరకు 5,26,996 మంది మరణించారు. మరో 1,19,264 మంది కరోనాతో కన్నుమూశారు. కాగా, గత 24 గంటల్లో 20,018 మంది ( 20,018 recoveries) మహమ్మారి నుంచి కోలుకుని డిశ్చార్జవగా, 68 మంది మరణించారు.
రోజువారీ పాజిటివిటీ రేటు 4.36 శాతానికి చేరిందని కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. ఇక మొత్తం కేసుల్లో 0.27 శాతం కేసులు యాక్టివ్‌గా ఉన్నాయని, రికవరీ రేటు 98.54 శాతం, మరణాలు 1.19 శాతంగా ఉన్నాయని వెల్లడించింది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 207.71 కోట్ల కరోనా వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేశామని పేర్కొన్నది.
ఇక దేశ రాజధాని ఢిల్లీలో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. శుక్రవారం నాడు కొత్తగా 2,136 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 10 మంది మరణించారు. కరోనాతో ఒకే రోజు 10 మంది మరణించడంతో ఢిల్లీ ఆరోగ్య శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. ఇక ఢిల్లీలో గత పది రోజుల నుంచి వరుసగా 2 వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ప్రస్తుతం పాజిటివిటీ రేటు 15.02 శాతంగా ఉంది. గురువారం రోజు ఆరుగురు మరణించగా, 2,726 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.
(The above story first appeared on LatestLY on Aug 13, 2022 10:38 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

