New York, August 12: బేబీ పౌడర్ ఉత్పత్తుల్లో దూసుకుపోతున్న ఉన్న జాన్సన్ అండ్ జాన్సన్(Johnson and Johnson) కంపెనీ తాజాగా సంచలన నిర్ణయం తీసుకుంది. కేన్సర్ కారకమైన(caused cancer) జాన్సన్ అండ్ జాన్సన్ బేబీ పౌడరు అమ్మకాలను 2023లో ప్రపంచ వ్యాప్తంగా నిలిపివేయాలని కంపెనీ నిర్ణయించింది. కాగా జాన్సన్ అండ్ జాన్సన్ బేబీ పౌడరులో (talcum baby-powder) కేన్సర్ కారకాలున్నాయని గతంలో జరిపిన పరీక్షల్లో తేలడంతో అమెరికా దేశంలో వేలాది మంది వినియోగదారులు భద్రత విషయంలో లా సూట్స్ ( lawsuits mount) వేశారు.
జాన్సన్ అండ్ జాన్సన్ టాల్క్ బేబీ పౌడర్ అమ్మకాలపై వేల సంఖ్యలో వినియోగదారులు భద్రతా వ్యాజ్యాలు కోర్టుల్లో వేశారు. దీంతో యునైటెడ్ స్టేట్స్, కెనడా(United States and Canada) దేశాల్లో 2020వ సంవత్సరంలో దీని అమ్మకాలను నిలిపివేశారు. జాన్సన్ అండ్ జాన్సన్ ప్రపంచవ్యాప్తంగా టాల్క్ ఆధారిత బేబీ పౌడర్ అమ్మకాలను 2023లో నిలిపివేయాలని నిర్ణయించినట్లు యూఎస్ ఔషధ తయారీదారు అయిన జాన్సన్ అండ్ జాన్సన్ తాజాగా ప్రకటించింది.
కార్న్‌స్టార్చ్ ఆధారిత బేబీ పౌడర్ ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో విక్రయిస్తున్నారు. ఆస్బెస్టాస్ కేన్సర్ కారకంతో కలుషితం కావడం వల్ల దాని టాల్క్ ఉత్పత్తులు వ్యాధికి కారణమయ్యాయని వినియోగదారులు 38వేల వ్యాజ్యాలను కోర్టుల్లో వేశారు. బేబీ పౌడరును పరీక్షించగా ఆస్బెస్టాస్ పాజిటివ్ అని తేలింది.